Home తాజా వార్తలు టిక్‌టాక్‌పై అమెరికా నిషేధం

టిక్‌టాక్‌పై అమెరికా నిషేధం

US ban Chinese-owned apps TikTok, WeChat

 

‘వి’ చాట్‌పైనా బ్యాన్
దేశ భద్రతకు ముప్పు ఉందని నిర్ణయం

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా యాప్‌లు టిక్‌టాక్, విచాట్‌లపై నిషేధం విధించారు. సెప్టెంబర్ 20 నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని శుక్రవారం అమెరికా వాణిజ్య విభాగం ఓ ఆర్డర్‌ను జారీ చేసింది. అమెరికా పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని చైనా సేకరిస్తోందని, ఈ యాప్‌ల తో యుఎస్ భద్రతకు ముప్పు ఉందని వాణిజ్య విభాగం కార్యదర్శి విల్‌బర్ రోస్ అన్నారు. దేశ భద్ర త దృష్టా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

టిక్‌టాక్ అమెరికా పౌరుల సమాచారాన్ని సేకరిస్తోందని యుఎస్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ తెలిపింది. అమెరికా, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ట్రంప్ చైనా యాప్‌లు టిక్‌టాక్ వంటి వాటికి గడువు ఇచ్చారు. గడువులోగా అమెరికా కంపెనీలకు విక్రయించకపోతే వాటిపై నిషేధం విధిస్తామని చెప్పారు. టిక్‌టాక్‌ను నిర్వహించే చైనా సంస్థ బైట్‌డాన్స్ విక్రయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అమెరికా చర్యలు చేపట్టింది.

US ban Chinese-owned apps TikTok, WeChat