Saturday, April 20, 2024

అమెరికాలో హ్యాకింగ్.. చైనా పౌరులపై కేసు

- Advertisement -
- Advertisement -

US charges 5 chinese citizens in global hacking

వాషింగ్టన్ : అమెరికాలో ఐదుగురు చైనా పౌరులపై హ్యాకింగ్ కేసులు నమోదు అయ్యాయి. వీరు మెగా హ్యాకింగ్ అక్రమాలకు పాల్పడ్డట్లు గుర్తించారు. దాదాపు వందకు పైగా కంపెనీల కీలక సమాచారాన్ని ఈ ఐదుగురు చైనీయులు కాజేసినట్లు అమెరికా జస్టిస్ విభాగం అభియోగాలు నమోదు చేసింది. అమెరికాలో ఇతర దేశాలలో కంపెనీల డాటా చౌర్యానికి పాల్పడటం ద్వారా వీరు భారీ స్థాయి హ్యాకింగ్‌కు దిగినట్లు ప్రాధమిక ఆధారాలు తెలిపాయి. అంతేకాకుండా ఈ వ్యక్తులు భారత ప్రభుత్వ నెట్‌వర్క్‌లు, విలువైన సాఫ్ట్‌వేర్ డాటా, వ్యాపార కీలక సమాచారాన్ని కొల్లగొట్టారని కూడా అభియోగాలలో పేర్కొన్నారు. ఈ అయిదుగురు కంప్యూటర్ హ్యాకింగ్‌లకు దిగినట్లు, ఇద్దరు మలేషియన్లు వారికి తగు విధంగా సహకరించినట్లు , వివిధ కంపెనీల సమాచారం రాబట్టుకుని పలువురిని బాధితులను చేసుకుంటూ తగు విధంగా డబ్బులు గడిస్తున్నట్లు వెల్లడైందని యుఎస్ డిప్యూటీ అటార్నీ జనరల్ జెఫెరీ రోజెన్ బుధవారం తెలిపారు. క్రైంకు సంబంధించి ఇప్పటికే మలేసియా వారిని అరెస్టు చేశారు. అయితే చైనా వారు తప్పించుకుతిరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.

US charges 5 chinese citizens in global hacking

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News