Friday, March 29, 2024

కరోనా రోగులకు హైడ్రాక్సీక్లోరోక్విన్ వద్దు

- Advertisement -
- Advertisement -

US has withdrawn use of hydroxychloroquine for Covid 19 patients

 

అమెరికా ప్రభుత్వ నిర్ణయం

వాషింగ్టన్: కోవిడ్-19 రోగుల చికిత్స కోసం అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగిస్తున్న క్లోరోక్విన్, హైడ్రాక్సీక్లోరోక్విన్ వంటి మలేరియా నిరోధక ఔషధాల వాడకాన్ని అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ సోమవారం ఉపసంహరించింది. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లను ఈ మందులు సమర్థంగా నియంత్రించకపోవడంతోపాటు వీటి వల్ల రోగులకు మేలు కన్నా కీడు జరిగే అవకాశమే ఎక్కువగా ఉండడంతో అమెరికా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

కరోనా మహమ్మారి తాకిడికి తీవ్రంగా విలవిలలాడుతున్న అమెరికాలో ఈ వైరస్‌ను కట్టడి చేయడంలో హైడ్రాక్సీక్లోరోక్విన్ అద్భుత పాత్ర పోషించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అభివర్ణించిన కొద్ది వారాలలోనే ఆ దేశ ఆహార, ఔషధ నియంత్రణ శాఖ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. కోవిడ్-19 చికిత్సకు ఈ మందు సమర్థవంతంగా పనిచేయకపోవడంతోపాటు దీని వాడకం వల్ల అనర్థాలు కూడా జరిగే అవకాశం ఉందని తాజా క్లినికల్ ప్రయోగాలలో తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ శాఖ ప్రకటించింది. ఈ మందు వల్ల గుండె సమస్యలు, రక్త ప్రసరణ తగ్గుదల, కండరాలు లేక రక్తనాళాలు దెబ్బతినడం తదితర ముప్పు ఏర్పడుతుందని క్లినికల్ ట్రయల్స్‌లో బయటపడడంతో కోవిడ్-19 రోగులకు హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడకాన్ని అమెరికా ప్రభుత్వం ఉపసంహరించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News