Home అంతర్జాతీయ వార్తలు సరైన రీతిలోనే హెచ్1 బి వీసాల వేట

సరైన రీతిలోనే హెచ్1 బి వీసాల వేట

US house backs bill to end trump us visa muslim ban

 

సెనెటర్లకు తెలిపిన ట్రంప్ యంత్రాంగం

వాషింగ్టన్: ట్రంప్ అధికార యంత్రాంగం మరోసారి వీసాల వేటలో పడింది. వీసా విధానాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అమెరికా పౌరసత్వ, వలసల సేవల విభాగం (యుఎస్‌సిఐఎస్) పలు చర్యలు తీసుకొంటోంది. ఈ విషయాన్ని ట్రంప్ అధికార యంత్రాంగం చట్టసభ సభ్యులకు తెలిపింది. కొన్ని సందర్భాలలో జరుగుతున్న వీసా దుర్వినియోగాలతో దేశ వ్యవస్థకు భంగం వాటిల్లుతోందని ట్రంప్ యంత్రాంగం తెలిపింది. ప్రత్యేకించి ఉద్యోగ ప్రాతిపదిక వీసాల పద్థతిలో లోపాలు ఉన్నాయని, వీటితో మోసాలకు అవకాశం ఉందని అభిప్రాయపడింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే హెచ్1 బి వీసాలపై పరిమితుల ఎంపిక ప్రక్రియలో మార్పులు చేపట్టినట్లు వివరించారు.

హెచ్ 1 బి వీసాల గురించి భారతీయ ఐటి నిపుణులు, విద్యాధికులు ఆశతో ఎదురుచూస్తుంటారు. అమెరికాలో అత్యున్నత వేతనాల ఉద్యోగాలకు ఈ వీసాలు అత్యవసరంగా మారాయి. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత వీటికి సంస్కరణల పేరిట పలు చర్యలు చేపట్టారు. ఈ వీసా విధానంతో అమెరికా కంపెనీలు నిర్థిష్ట ప్రత్యేక ఉద్యోగాలలో విదేశీయులను తీసుకుంటాయి. ఇందుకు సాంకేతిక, విద్యాపరమైన అనుభవం నైపుణ్యాలను ప్రతిపాదికగా చేసుకుంటున్నాయి. ప్రతి ఏటా ఈ వీసా విధానంతో ప్రముఖ అమెరికా కంపెనీలు వేలాది మంది భారతీయ, చైనా దేశపు వారిని ఉద్యోగులుగా తీసుకుంటున్నాయి. అయితే యుఎస్‌సిఐఎస్ ఈ క్రమంలో ఇప్పుడు పలు నిబంధనలను అమలు పరుస్తోందని అధికార యంత్రాంగం సెనెటర్లకు తెలిపింది.

అమెరికాలోని ఉద్యోగులకు, విద్యావంతుకు మేలు జరగాలనే ప్రధాన ఉద్ధేశంతోనే, అదే విధంగా అమెరికా కంపెనీలు వారి వ్యాపారాలకు నష్టం జరగకూడదనే ఆలోచనతోనే సరికొత్త వీసా విధానాలను చేపట్టినట్లు చట్టసభ సభ్యులకు ట్రంప్ అధికార యంత్రాంగం తెలిపింది. హెచ్ 1బి వీసాల ప్రక్రియలతో మోసాలు జరుగుతున్న విషయాన్ని గుర్తించామని, వీటితో అమెరికా దేశీయంగా పలు విధాలుగా దెబ్బతింటోందని దీనిని నివారించేందుకు పలు చర్యలు చేపట్టినట్లు వివరించారు, ప్రస్తుత పాలసీ విషయాల విభాగం డిప్యూటీ డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో గురువారం ఈ అంశాలను సెనెటర్లతో జరిగిన భేటీ సందర్భంగా తెలియచేశారు.

US house backs bill to end trump us visa muslim ban