Tuesday, April 23, 2024

చైనా పౌరులపై అమెరికా మరిన్ని వీసా ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

US imposes more Visa restrictions on Chinese citizens

 

వాషింగ్టన్: విదేశాల నుంచి వచ్చే ఆదేశాల మేరకు తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్న చైనా పౌరులపై వీసా ఆంక్షలు విధించనున్నట్లు ఆమెరికా విదేశాంగ శాఖ శుక్రవారం ప్రకటించింది. ఈ ఆంక్షలు చైనా కమ్యూనిస్టు పార్టీ అధికారులకు లేదా యునైటెడ్ ఫ్రంట్ వర్క్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన ప్రచారాలను ప్రభావితం చేస్తున్న వారికి వర్తిస్తాయని విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో తెలిపారు.

టిబెట్, యుగర్ తదితర ప్రాంతాలలో మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్న చైనాను విమర్శించే వారిపై వేధింపులకు యునైటెడ్ ఫ్రంట్ వర్క్ డిపార్ట్‌మెంట్ పాల్పడుతోందని, విమర్శించే వారి పేర్లను, వారి కుటుంబ సభ్యుల పేర్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తూ బహిరంగంగా వారిపై వేధింపులకు పాల్పడుతోందని పాంపియో చెప్పారు. అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారికి అమెరికాలో ప్రవేశించే అర్హత లేదని ఆయన అన్నారు. కాగా.. ఈ తాజా ఆంక్షలపై చైన తీవ్రంగా స్పందించింది. చైనా పౌరులపై అమెరికా విధించనున్న వీసా ఆంక్షలు అమెరికా ప్రతిష్టను అంతర్జాతీయంగా దెబ్బతీస్తాయని, అమెరికా స్వప్రయోజనాలకే ఇవి విఘాతం కల్పిస్తాయని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్యింగ్ పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News