Home అంతర్జాతీయ వార్తలు మాస్క్ లేకుండా ముచ్చట్లాడడం ముప్పే

మాస్క్ లేకుండా ముచ్చట్లాడడం ముప్పే

US medical experts say corona virus could spread through the air

 

అమెరికా వైద్య నిపుణుల అధ్యయనం వెల్లడి

వాషింగ్టన్ : నాలుగు గోడల మధ్య కూర్చుని ముచ్చట్లు చెప్పుకునే వ్యక్తులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మాస్క్ లేని వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు నోటి నుంచి శ్వాసించే సమయంలో ముక్కు నుంచి వెలువడే నీటి ఆవిరితో కూడిన సూక్ష్మ తుంపరుల నుంచి కరోనా వైరస్ గాలిలోకి వ్యాపించే అవకాశం ఉందని తెలిపారు. అలా వచ్చిన వైరస్ అధిక సమయం పాటు గది వాతావరణంలో తేలియాడుతుందని ఇతరులకు సులభంగా అది సంక్రమిస్తుందని తమ అధ్యయనంలో తేలిందని వెల్లడించారు. అమెరికాకు చెందిన జాతీయ మధుమేహం, జీర్ణాశయ, మూత్రపిండాల వ్యాధుల సంస్థ నిపుణులు ఈ పరిశోధనను నిర్వహించారు. ఇంటర్నెట్ మెడిసిన్ అనే పత్రికలో ఈ వివరాలు వెలువడ్డాయి.

మాట్లాడుతున్నప్పుడు నోటి నుంచి వచ్చే తుంపర్లు, శ్వాస వదిలినప్పుడు వెలువడే గాలి లోని సూక్ష్మ బిందువుల కంటే పెద్ద పరిమాణంలో ఉంటాయి. అవి మోసుకొచ్చే వైరస్‌ల సంఖ్యా ఎక్కువగా ఉంటుంది. గదిలో గాలి ధారాళంగా వీచే అవకాశం లేనప్పుడు వైరస్ ఎక్కువ సమయం గది లోపలే తేలియాడుతుంటుంది. దానివల్ల ఆ గదిలో ఉండే వ్యక్తులకు వైరస్ సంక్రమిస్తుందని తమ పరిశీలనలో తేలిందని అధ్యయన నివేదిక రచయిత సీనియర్ శాస్త్రవేత్త ఆద్రియాన్ బాక్స్ తెలిపారు. గది లేదా హాలులో కూర్చుని ఆహార పదార్ధాలు తినడం,పానీయాలు తాగడం, పెద్దగా మాట్లాడుకోవడం సహజం గానే జరుగుతుంటుంది. ఇవే పరిస్థితులు నెలకొని ఉండే రెస్టారెంట్లు, బార్లు, వైరస్ వ్యాప్తికి ప్రధాన కేంద్రాలుగా ఉన్న విషయం తెలిసిందే.

US medical experts say covid virus could spread through the air