- Advertisement -
అమెరికాకు ఇరాన్ సూచన
టెహ్రాన్ : ప్రపంచ దేశాలతో కుదిరిన అణుఒప్పందం ప్రకారం ఇరాన్ కట్టుబడి ఉండాలంటే ఇరాన్‌పై విధించిన ఆంక్షలను అమెరికా మొదట ఎత్తివేయాలని ఇరాన్ అధినేత ఆదివారం విజ్ఞప్తి చేశారు. తమపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తే తాము ఈ ఒప్పందంపై పరిశీలిస్తామని తరువాత తమ హామీలకు కట్టుబడి ఉంటామని ఇరాన్ అధినేత ఆయతుల్లా అలి ఖమైనీ పేర్కొన్నట్టు ఇరాన్ టివి ఛానల్ వెల్లడించింది. ఇరాన్‌తో కుదిరిన అణుఒప్పందం నుంచి అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఏకపక్షంగా 2018 లో అమెరికాను వైదొలగించారు. యురేనియం వినియోగాన్ని అదుపు చేస్తామని ఆ ఒప్పందంలో ఇరాన్ ఒప్పుకుంది. దీనికి బదులుగా ఆర్థిక ఆంక్షలను తమపై ఎత్తి వేయాలని ఆనాడు ఇరాన్ అమెరికాను కోరింది. అయితే ఇప్పుడు ఆ ఒప్పందాన్ని తిరిగి అమలయ్యేలా పరిశీలిస్తానని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇటీవలనే ప్రకటించారు.
- Advertisement -