Thursday, April 25, 2024

సెరెనా, థిమ్ ముందుకు….

- Advertisement -
- Advertisement -

US Open 2020: thiem serena won in third round

 

న్యూయార్క్: ప్రతిష్టాత్మకమైన యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సెరెనా విలియమ్స్ (అమెరికా), డొమినిక్ థిమ్ (ఆస్ట్రియా) మూడో రౌండ్‌కు చేరుకున్నారు. మరోవైపు బ్రిటన్ ఆశాకిరణం ఆండీ ముర్రే, భారత ఆటగాడు సుమిత్ నాగల్ రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. మహిళల సింగిల్స్‌లో మాజీ నంబర్ వన్ విక్టోరియా అజరెంకా (బెలారస్), మాడిసన్ కీస్ (అమెరికా) రెండో రౌండ్‌లో విజయం సాధించారు. పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్ డానిల్ మెద్వెద్వేవ్ (రష్యా), ఆరో సీడ్ మాటియో బెర్రిటెని (ఇటలీ) మూడో రౌండ్‌కు దూసుకెళ్లారు. మహిళల విభాగంలో అగ్రశ్రేణి క్రీడాకారిణి సబలెంకా రెండో రౌండ్‌లోనే ఓటమి పాలైంది.
సుమిత్ ఔట్
పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాడు సుమిత్ నాగల్ పోరాటం రెండో రౌండ్‌లోనే ముగిసింది. రెండో సీడ్ డొమినిక్ థిమ్‌తో జరిగిన పోరులో నాగ ల్ ఓటమి చవిచూశాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన థిమ్ ఏ దశలోనూ నాగల్‌కు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. పూర్తి ఆధిపత్యం చెలాయించిన థిమ్ 63, 63, 63తో నాగల్‌ను ఓడించాడు. మరో పోటీలో మూడో సీడ్ మెద్వెద్వేవ్ విజయం సాధించాడు. ఆస్ట్రేలియాకు చెందిన క్రిస్టోఫర్‌తో జరిగిన పోరులో మెద్వెద్వేవ్ 62, 62, 64తో జయకేతనం ఎగుర వేశాడు. మరోవైపు బెర్రిటెని 64, 64, 76 తేడాతో హంబర్ట్ (ఫ్రాన్స్)ను ఓడించాడు. ఇతర పోటీల్లో 8వ బౌటిస్టా అగట్ (స్పెయిన్), పదో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ తదితరులు విజయం సాధించి మూడో రౌండ్‌కు చేరుకున్నారు.
ఎదురులేని సెరెనా
మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్ సెరెనా అలవోక విజయం సాధించింది. రష్యా క్రీడాకారిణి మార్గరిటాతో జరిగిన పోరులో సెరెనా 62, 64తో జయకేతనం ఎగుర వేసింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన సెరెనా ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. వరుసగా రెండు సెట్లు గెలిచి మూడో రౌండ్‌కు చేరుకుంది. మరో పోటీలో విక్టోరియా అజరెంకా 61, 63తో బెలారస్‌కే చెందిన ఐదో సీడ్ సబలెంకాను చిత్తు చేసింది. మరో పోటీలో మాడిసన్ కీస్ విజయం సాధించింది. ఏడో సీడ్ కీస్ 62, 61తో బొలొసొవా (స్పెయిన్)ను చిత్తు చేసి మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News