Wednesday, November 6, 2024

హెచ్ 1వీసాదారులకు భారీ ఊరట

- Advertisement -
- Advertisement -

US President Joe Biden's key decision on H4 visa work permits

 

వర్క్ పర్మిట్ల రద్దు నిర్ణయం ఉపసంహరణకు బైడెన్ నిర్ణయం
గట్టెక్కిన భారతీయుల కష్టాలు

వాషింగ్టన్: హెచ్1బి వీసాదారుల జీవిత భాగస్వాములకు ఇచ్చే హెచ్4 వీసాల వర్క్ పర్మిట్లపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. హెచ్4 వర్క్‌పర్మిట్లను రద్దు చేస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసున్న నిర్ణయాన్ని బైడెన్ తోసిపుచ్చుతూ బైడెన్ మంగళవారం సాయంత్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో నాలుగేళ్లుగా అమెరికాలో ఉద్యోగాలు పొందడానికి అవస్థలు పడుతున్న హెచ్1బి వీసాదారుల జీవిత భాగస్వాములకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ నిర్ణయం వల్ల భారతీయులకే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. కాగా అమెరికా పౌరసత్వం, ఇమిగ్రేషన్ సేవల శాఖ ( యుఎస్ సిఐఎస్) హెచ్1బి వీసాదారుల జీవిత భాగస్వాములకు, 21 ఏళ్ల లోపు వారి పిల్లలకు ఈ హెచ్4 వీసాలను జారీ చేస్తుంది. ఇక హెచ్1బి వీసాదారుల జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగావకాశాలు పొందడానికి వీలుగా హెచ్4 వీసాలను మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో 2015లో హోం శాఖ జారీ చేసింది.

అయితే 2016 లో అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఈ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు అమెరికా కోర్టుకు తెలిపారు. దీంతో హెచ్1బి వీసాదారుల జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగాలు చేసేందుకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో 2020 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ ఓటమి పాలయ్యారు. దాంతో గత ఏడాది డిసెంబర్‌లో హెచ్1బి వీసాదారుల జీవిత భాగస్వాముల ఉద్యోగ పర్మిట్లను పునరుద్ధరించాలని 60 మంది అమెరికా చట్టసభ సభ్యులు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్‌కు లేఖ రాశారు. ట్రంప్ అధికార యంత్రాంగం హెచ్4 వీసాలపై తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని వారు ఆ లేఖలో కోరారు. హెచ్4 వీసాలను పునరుద్ధరించాలని కోరుతూ రాసిన లేఖపై సంతకాలు చేసిన వారిలో ఇండో అమెరికన్ ఎంపీలైన డాక్టర్ అమి బెరా, రాజా కృష్ణమూర్తి, ప్రమీలా జయపాల్ వంటి వారు కూడా ఉన్నారు. లక్షకు పైగా ఉన్న హెచ్4వీసాదారుల్లో 90 శాతానికి పైగాభారతీయులు ఉండగా వారిలో93 శాతం మంది మహిళలే ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News