Thursday, March 28, 2024

ఇండియాకు సాయం చేసేందుకు కట్టుబడి ఉన్నాం: అమెరికా

- Advertisement -
- Advertisement -

US to deliver medical supplies worth over USD 100 million to India

వాషింగ్టన్: కరోనాపై పోరులో భారత్ కు మద్దతు కొనసాగిస్తామని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. ఇండియాకు సాయం చేసేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. రాబోయే రోజుల్లో భారత్ కు 100 మిలియన్ డాలర్లు విలువైన వైద్య సామగ్రి పంపిణీ చేస్తోందని వైట్ హౌస్ తెలిపింది. భారత్ లో ఆరోగ్య కార్యకర్తలకు శక్తిమేరకు సాయం చేస్తామని వెల్లడించింది. కోవిడ్ కు సంబంధించిన అత్యవసర పరికరాలు ఇప్పటికే పంపించామని వివరించింది. 440 ఆక్సిజన్ సిలిండర్లు, రెగ్యులేటర్లు కాలిఫోర్నియా విరాళం ఇచ్చిందని అమెరికా చెప్పుకొచ్చింది. భారత్ కు 9.6 లక్షల ర్యాపిడ్ కిట్లు, ఆరోగ్య కార్యకర్తల కోసం లక్ష ఎన్-95 మాస్కులు పంపిస్తున్నామని అగ్రరాజ్యం పేర్కొంది. యుఎస్ ఎయిడ్ తరుపున ఇప్పటికే నేరుగా కోటిమందికి సాయం చేశామంది. కరోనాపై పోరులో యుఎస్ ఎయిడ్ కింద 23 మిలియన్ డాలర్లు సాయం చేశామన్న అమెరికా.. యుఎస్ తరుపున త్వరలో వెయ్యి ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు సరఫరా చేస్తామంది. కోవిడ్-19 మహమ్మారికి స్పందించడానికి అమెరికా, భారత్ కలిసి పనిచేశాయని వైట్ హౌస్ తెలిపింది.

US to deliver medical supplies worth over USD 100 million to India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News