Friday, March 29, 2024

డబ్ల్యుహెచ్‌ఒకు అమెరికా గుడ్ బై..

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్‌ఒ) నుంచి తాము వైదొలగుతున్నట్టు ఐక్యరాజ్యసమితి(యుఎన్)కి అధికారికంగా ట్రంప్ ప్రభుత్వం తెలియచేసింది. కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తున్న నమయంలో ఆ సంస్థ నుంచి తెగతెంపులు చేసుకుంది. కరోనా నివారణకు అవసరమైన సంస్కరణలు చేపట్టడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వైఫల్యం చెందిందని ఆరోపిస్తూ గత ఏప్రిల్‌లో ఆ సంస్థకు నిధులు ఆపుచేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. అలాగే ఆ సంస్థ నుంచి వైదొలగుతున్నట్టు గత మేలో ప్రకటించారు. చైనాలోని వుహాన్‌లో గత మొదట కరోనా వైరస్ పుట్టినప్పుడు చైనా ఎవరికీ దాని గురించి చెప్పలేదు సరికదా, దాచిపెట్టిందని, అప్పటికైనా ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తం కాలేదు సరికదా చైనా తప్పు ఇందులో ఏదీ లేదన్నట్టు వ్యవహరించి చైనాను వెనకేసుకు వచ్చిందని అమెరికా ధ్వజమెత్తింది. ఫలితంగా ఒక్క అమెరికాలోనే 1,30,000 మంది మృతి చెందగా, ప్రపంచం మొత్తం మీద అనేక లక్షల మంది మృతి చెందారని అమెరికా తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థపై చైనా పూర్తి నియంత్రణ ఉందని గత మేలో ట్రంప్ ఆరోపించారు. అంతేకాదు కరోనా వైరస్ మూలాలను దాచిపెట్టడానికి చైనా ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు అత్యధికంగా నిధులు అందించే ఏకైక దేశం అమెరికాయే. ఏటా 450 మిలియన్ డాలర్లను అమెరికా అందించేది. చైనా మాత్రం కేవలం 40 మిలియన్ డాలర్లను అందిస్తోంది. అంటే అమెరికా ఇచ్చే నిధుల్లో పదోవంతు మాత్రమే చైనా అందిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలిగే ప్రక్రియ జులై 6 నుంచి అమలులోకి వస్తుందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధి స్టెఫెనే డుజారిక్ ప్రకటించారు.

US to Leave from WHO next July

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News