Thursday, April 25, 2024

కెనడా, మెక్సికో సరిహద్దు ఆంక్షలు ఎత్తివేయనున్న అమెరికా

- Advertisement -
- Advertisement -

US border restrictions

వాషింగ్టన్: పూర్తి వ్యాక్సిన్ తీసుకున్న విదేశీయులకు కెనడా, మెక్సికో సరిహద్దు ఆంక్షలను అమెరికా నవంబర్ నుంచి ఎత్తివేయనున్నట్లు ఇద్దరు అమెరికా అధికారులు మంగళవారం తెలిపారు. హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అలేజాండ్రో మయోర్కస్ భూ సరిహద్దులు, ఫెర్రీ క్రాసింగ్‌కు సంబంధించిన నియమాలను బుధవారం అధికారికంగా ప్రకటించనున్నారు. న్యూయార్క్‌లోని శాసనకర్తలు ఈ చర్యను అభినందించారు.

అమెరికా కరోనా మహమ్మారి కాలంలో సరిహద్దులు మూసేయడంతో ఇతరులు చాలా కష్టాలకు గురయ్యారు. ఇదిలా ఉండగా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సరారు తెచ్చిన ‘టైటిల్ 42’ను ఎత్తివేయబోమని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వ అధికారులు తెలిపారు. కొన్ని షరతులతో సరిహద్దు ఆంక్షలను నవంబర్ నెల మొదట్లోనే ఎత్తివేసే అవకాశాలున్నాయని ఆ అధికారులు తెలిపారు.

పూర్తిగా వ్యాక్సిన్ తీసుకున్న అమెరికాకు చెందిన సాధారణ పర్యాటకులను ఆగస్టు 9 నుంచి కెనడా అనుమతిస్తోంది. అమెరికా కూడా నాన్-ఎసన్సియల్ విదేశీ పర్యాటకులపై ఆంక్షలు కనుక ఎత్తివేస్తే వారు కూడా స్వేచ్ఛగా సందర్శించే అవకాశం ఉంటుంది. చైనా, ఇండియా, బ్రెజిల్, యూరొప్ వంటి 33 దేశాలకు చెందిన వైమానిక ప్రయాణికులపై పర్యాటక ఆంక్షలు నవంబర్ మొదలు నుంచి ఎత్తివేయనున్నట్లు అమెరికా వైట్ హౌస్ సెప్టెంబర్ 20న ప్రకటించింది.
అమెరికాలో సరిహద్దులుల దాటే విదేశీ పర్యాటకులు పూర్తిగా వ్యాక్సిన్ చేసుకుని ఉండాలి. అయితే వారు వ్యాక్సిన్ వేసుకున్నట్లు రుజువును చూపించాల్సిన అవసరం కూడా లేదు. కానీ అమెరికా కస్టమ్స్ అండ్ బార్డర్ పెట్రోల్ వారు రిఫర్ చేస్తే మాత్రం రుజువులు పరిశీలిస్తారు. ఇదిలావుండగా అమెరికా సరిహద్దు ఆంక్షలు స్వదేశాగమనం చేసే అమెరికా పౌరులను దూరంగా ఉంచలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News