Friday, March 29, 2024

లాక్‌డౌన్ మరింత కఠినం.. డ్రోన్లతో నిఘా: మహేష్ భగవత్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: లాక్‌డౌన్ సమర్థవంతంగా అమలు చేసేందుకు డ్రోన్లను ఉపయోగించనున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిఘా కోసం వాడుతున్న డ్రోన్లను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ను ఉల్లంఘించే వారి గురించి తెలుసుకోవడానికి డ్రోన్లను వాడనున్నట్లు తెలిపారు. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు బాలాపూర్, మౌలాలి, పహాడిషరీఫ్ ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా పెట్టనున్నామని తెలిపారు. ఈ ఏరియాల్లో సాయంత్రం 6 తర్వాత కూడా షాపులను తెరిచి ఉంచితే డ్రోన్ల సాయంతో గుర్తించి వాటిని మూసి వేసేందుకు సాయంపడుతుందని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. పోలీసులు పెట్రోలింగ్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని అన్నారు.

వైద్య సిబ్బందితో కలిసి పోలీసులు కూడా క్వారంటైన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. పెట్రోలింగ్ వాహనాలను డిస్‌ఇన్‌స్పెక్షన్ టెక్నాలజీతో ఎప్పటికప్పుడు క్లీన్ చేయన్నుట్లు తెలిపారు. సెయంట్ సంస్థ డ్రోన్ టెక్నాలజీని అందజేస్తోందని అన్నారు. కోవిడ్19 కోసం కొనసాగుతున్న లాక్‌డౌన్‌కు పోలీసులకు టెక్నాలజీని అందజేయనున్నట్లు తెలిపారు. టెక్నాలజీని వాడడం వల్ల కోరానాను మరిత సమర్థవంతంగా ఎదుర్కోగలమని తెలిపారు. టెక్నాలజీ సాయంతో అవసరం ఉన్న ప్రాంతాల్లో వెంటనే భద్రతను మోహరించవచ్చని అన్నారు.
వాహనాల శానిటైజ్..
రాచకొండ పోలీసులు పెట్రోలింగ్ కోసం వాడుతున్న వాహనాలను రోజూ శానిటైజ్ చేయిస్తున్నామని సిపి మహేష్ భగవత్ తెలిపారు. హర్షా టొయోటా సాకారంతో వాహనాలను శానిటైజ్ చేయిస్తున్నామని తెలిపారు. రానున్న నాలుగు నెలలపాటు శానిటైజ్ చేయనున్నట్లు తెలిపారు.

Use drones to Strictly implement lockdown:Rachakonda CP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News