Tuesday, February 7, 2023

‘పద్మశ్రీ’ అందుకోవడం ఇష్టంలేదు : ఇమ్రత్ ఖాన్

- Advertisement -

Imrat-Khanన్యూఢిల్లీ : భారత ప్రభుత్వం గత నెల 25న దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఇందులో ప్రముఖ సితార్, సుర్బహర్ వాయిద్యకారుడు ఉస్తద్ ఇమ్రత్ ఖాన్ కు ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని ప్రకటించింది. అయితే ఇమ్రత్ ఖాన్ ఈ పురస్కారాన్ని అందుకోవడం ఇష్టం లేదని తెలిపారు. 82 ఏళ్ల వయస్సులో ఈ పద్మశ్రీ అందుకోవడం ఇష్టం లేదని అంతేకాక ప్రపంచవ్యాప్తంగా తాను సంపాదించుకున్న పేరు ప్రఖాతలు పద్మశ్రీతో పోల్చుకోలేనని పేర్కొన్నారు.
‘నాకు మంచి ఉద్దేశంతోనే పద్మశ్రీ ప్రకటించినా..నాకు మాత్రం ఎన్నో సందేహాలున్నాయి. ఎందుకంటే ఈ అవార్డు నాకు చాలా ఆలస్యంగా వచ్చింది. నాకంటే ముందే నా జూనియర్లు దీనిని అందుకున్నారు.’ అని చికాగోలో భారత రాయబారితో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన వెల్లడించారు. తన జీవితంలో ఈ వృత్తిని ఉన్నత స్థానంలో ఉంచానని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles