Saturday, April 20, 2024

దుబాయిలో ఉత్తునూర్‌ వాసి మృతి

- Advertisement -
- Advertisement -

Uthunnur resident

 

సదాశివనగర్/కామారెడ్డి: బతుకు దెరువు కోసం ఇతర దేశాలకు వెలుతున్న వలస కార్మికులకు అక్కడి దేశాలు రక్షణ కల్పించాలని గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్, కల్చర్ అసోషియేషన్ అధ్యక్షుడు పాట్కూరి బసంత్‌రెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని ఉత్తునూర్ గ్రామానికి చెందిన కయ్యాల నవీన్ 26 జీవనోపాది కొరకు దుబాయి దేశం వెళ్లి కన్‌ష్ట్రక్షన్ పనులు చేస్తున్న సమయంలో గురువారం జరిగిన ప్రమాదంలో మృత్తి చెందాడు. అతని కుటుంబ సభ్యులను శుక్రవారం స్థానిక ఎంపిటిసి కె. రాంచందర్‌రావుతో కలసి పరామర్షించారు.

బతుకుదెరువు కోసం దుబాయి వెల్లి అక్కడ దుర్మరణం చెందడం బాదాకరమన్నారు, దౌత్య కార్యాలయం ద్వారా సమాచారం వేగం చేసి మృతదేహాన్ని త్వరగా స్వదేశాని రప్పించేందుకు ప్రయత్నిస్తామన్నారు. అలాగే నష్ట పరిహారం కింద 50, లక్షల రూపాయలకు కంపనిపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. మృతుని భార్య మౌనిక, తల్లి నర్సవ్వ, తండ్రి ఎల్లయ్య రోదనలు మిన్నంటాయి. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఓదారుస్తున్నారు. మృతునికి 2 సంవత్సరాల కొడుకు ఉన్నాడు, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Uthunnur resident died in Dubai
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News