Home తాజా వార్తలు ఉత్తమ్ ఇంటి వద్ద ఉధ్రిక్తత

ఉత్తమ్ ఇంటి వద్ద ఉధ్రిక్తత

Uttam Kumar reddy, Jagga reddy house arrest

 

హైదరాబాద్‌: టిపిసిపి అధ్యక్షుడు, ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటి వద్ద గురువారం నాడు ముందస్తుగా పోలీసులు బందోబస్తు నిర్వహించడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రాజెక్టుల పరిశీలన పేరుతో కాంగ్రెస్ పార్టీ జలదీక్షలతో పాటు సంగారెడ్డి జిల్లాలోని మంజీరా డ్యామ్ పరిశీలనకు వెళ్లాలని ఉత్తమ్ సహా ఆ నియోజకవర్గ ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి సిద్ధం కావడంతో వారిని నిలువరించేందుకు ముందస్తుగా ఉత్తమ్ ఇంటి వద్దకు పోలీసులు చేరుకున్నారు.కాగా జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు కృష్ణా పరివాహక ప్రాంత ప్రాజెక్టులను సందర్శించేందుకు బయలుదేరిన కాంగ్రెస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో గురువారం సంగారెడ్డి జిల్లాలోని మంజీరా డ్యామ్ పరిశీలనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి వెళ్లాలని నిర్ణయించారు.

బంజారాహిల్స్‌లోని ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసం నుంచి ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి, పలువురు నేతలు బయలుదేరనున్నారనే సమాచారం మేరకు వారిని నిలువరించేందుకు పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఎంఎలఎ జగ్గారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌లను బయటికి వెళ్లనివ్వకపోవడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఇంట్లోనే విలేకరుల సమావేశం నిర్వహించారు. జలదీక్ష పేరుతో ప్రాజక్టుల పరిశీలనకు వెళ్తున్న తమను అడ్డుకోవటాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. ప్రాజక్టుల పరిశీలన అనేది తమ హక్కు అని, గోదావరి నీటితో సింగూరు, మంజీరా డ్యాంను నింపుతామని మాట తప్పారని గుర్తు చేశారు.ఈక్రమంలో 80 శాతం పూర్తైన ఎస్‌ఎల్‌బిసిని ప్రభుత్వం పట్టించుకోవటం లేదని న్నారు. గ్రావిటీ ద్వారా నీరొచ్చే ప్రాజెక్టులకు రూపాయి పని కూడా చేయటం లేదని ఉత్తమ్ విమర్శించారు.

Uttam Kumar reddy, Jagga reddy house arrest