Thursday, April 25, 2024

టిపిసిసి అధ్యక్ష పదవికి ఉత్తమ్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

Uttam kumar reddy resignation as TPCC chief

 

మన తెలంగాణ/హైదరాబాద్: టిపిసిసి చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్‌రెడ్డి రాజీనామా చేశారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం నేపథ్యంలో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. కాంగ్రెస్ ఓటమికి తనదే బాధ్యత అని ప్రకటించారు. అనంతరం రాజీనామా లేఖను ఏఐసిసికి పంపనున్నారు. కొంతకాలంగా కాంగ్రెస్‌కు వరుస ఓటములు ఎదురుకావడం.. కాంగ్రెస్ నుంచి కొందరు కీలకమైన నేతలు బిజెపిలోకి చేరడం వంటి పరిణామాలతో పాటు తాజాగా కాంగ్రెస్ ఓటమి చెందడం ఉత్తమ్ రాజీనామాకు దారితీసింది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని, తన స్థానంలో కొత్త అధ్యక్షుడిని నియ మించే ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని కాంగ్రెస్ హైకమాండ్‌కు ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు. జిహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విస్తృతంగా ప్రచారం చేసిన సంగతి విదితమే. ఉత్తమ్‌తో పాటు పలువురు టిపిసిసి కీలక నేతలు ప్రచారం చేసినప్పటికీ ఎన్నికల ఫలితాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితాలు దక్కలేదు. కాంగ్రెస్ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. 2014 నుంచి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

దెబ్బతీసిన అంతర్గత విభేదాలు.. అంతర్గత ప్రజాస్వామ్యం..

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఆ పార్టీని నట్టేట ముంచాయి. పార్టీ ఉనికిని ప్రశ్నార్థకంలో పడేశాయి. ఇక పార్టీలో సర్వ సాధారణంగా ఉండే అంతర్గత ప్రజాస్వామ్యం ఆ పార్టీకి మైనస్‌గా నిలిచింది. గత ఆరేళ్లుగా పార్టీ సారథిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీని సజావుగా నడపడంలో పూర్తిస్థాయిలో వైఫల్యం చెందారు. టిపిసిసి మార్పు విషయమై గత కొంతకాలంగా పార్టీ హైకమాండ్ చేసిన ప్రయత్నాలకు పార్టీలోని వుండే కొందరు నేతలు ఎప్పటికప్పుడు అడ్డుపుల్ల వేస్తూ వచ్చారు. దీంతో, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దీర్ఘకాలంగా టిపిసిసి సారథిగా కొనసాగారు.

గతంలోనే అధిష్టానానికి వేడుకోలు..

హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి తరువాత టిపిసిసి చీఫ్ పదవికి రాజీనామా చేయడానికి ఢిల్లీ వెళ్లిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇక తాను ఈ పదవిలో కొనసాగలేనని పార్టీ అధినాయకత్వానికి స్పష్టం చేసినట్లు సమాచారం.
ఫిబ్రవరి 2015 నుంచి టిపిసిసి అధ్యక్షుడిగా కొనసాగింపు ఫిబ్రవరి 2015 నుంచి ఉత్తమ్ టిపిసిసి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా ఆయన పార్టీ అధ్యక్ష పదవి విషయంలో అసం తృప్తిగానే ఉన్నారు. పార్టీ వరుస ఓటములతో పిసిసి చీఫ్ పదవికి రాజీనామా చేసినట్లు ప్రస్తుత రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

ఉత్తమ్ ప్రస్థానం…

ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తొలిసారిగా 1994లో కోదాడ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 1999 అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2004 శాసనసభ ఎన్నికల్లో కోదాడ నుండి రెండవసారి ఎంఎల్‌ఎగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నూతనంగా ఏర్పడిన హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాట ్యక 2014,2018 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా కూడా పనిచేశారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో నల్గొండ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి టిఆర్‌ఎస్ అభ్యర్థిపై గెలుపొందారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News