Thursday, March 28, 2024

మంత్రికి కరోనా…. క్వారంటైన్ లో సిఎం….

- Advertisement -
- Advertisement -

Uttarakhand Chief minister quarantine

డెహ్రాడూన్:  ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ మంత్రి సత్పాల్ సింగ్‌కు కరోనా వైరస్ సోకింది. దీంతో ఉత్తరాఖండ్ సిఎం త్రివేంద సింగ్ రావత్, అటవీ శాఖ మంత్రి హరక్ సింగ్ రావత్ క్వారంటైన్‌లో ఉంచారు. పర్యాటక శాఖ మంత్రి సత్పాల్ సింగ్‌కు ఆయన భార్య అమృతా రావత్ ద్వారా సోకిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అమృతా రావత్‌కు ఆదివారం కరోనా వైరస్ సోకడంతో ఐసోలేషన్‌లో చికిత్స పొందుతుంది. మహరాజ్ కుటుంబంతో సన్నిహితంగా ఉన్న 17 మందిని క్వారంటైన్ చేశారు. సత్పాల్ సింగ్ ఇద్దరు కుమారులు, ఇద్దరు కోడళ్లకు కరోనా వైరస్ సోకిందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వైల్లడించింది. సత్పాల్ సింగ్ మంత్రి వర్గ సమావేశంలో పాల్గొన్నారని, ఆ సమావేశానికి వచ్చిన మంత్రులు, అధికారులను క్వారంటైన్ చేయనున్నట్టు సమాచారం. ఉత్తరాఖండ్‌లో కరోనా వైరస్ 907 మందికి వ్యాపించగా ఐదుగురు చనిపోయారు. భారత్‌లో 24 గంటల్లో 8383 కరోనా కేసులు పెరిగాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 1.90 లక్షలకు చేరుకోగా 5408 మంది మృత్యువాతపడ్డారు. దాదాపుగా గత మూడు రోజుల నుంచి ప్రతి రోజు ఎనిమిది కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇలాగే కొనసాగితే భారత్ పది హేను రోజులలో ప్రపంచంలో కరోనా కేసుల సంఖ్యలో నాలుగో స్థానానికి చేరుకుంటుంది.

రాష్ట్రాల వారిగా కరోనా  వివరాలు:

రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు
బాధితుల సంఖ్య చికిత్స పొందుతున్నవారు కోలుకున్నవారు మృతులు
మహారాష్ట్ర
67,655 36,040 29,329 2,286
తమిళనాడు 22,333 9,400 12,757 176
ఢిల్లీ 19,844 10,893 8,478 473
గుజరాత్ 16,794 5,837 9,919 1,038
రాజస్థాన్ 8,831 2,604 6,032 195
మధ్య ప్రదేశ్ 8,089 2,897 4,842 350
ఉత్తర ప్రదేశ్ 8,075 3,015 4,843 217
రాష్ట్రాలు గుర్తించిన వారు
5,630 5,630 0 0
పశ్చిమ బెంగాల్ 5,501 3,027 2,157 317
బిహార్
3,807 2,264 1,520 23
ఆంధ్రప్రదేశ్
3,571 1,169 2,340 62
కర్నాటక 3,221 1,950 1,218 51
తెలంగాణ 2,698 1,188 1,428 82
జమ్ము కశ్మీర్ 2,446 1,491 927 28
పంజాబ్ 2,263 231 1,987 45
హర్యానా 2,091 1,023 1,048 20
ఒడిశా 1,948 813 1,126 9
అస్సాం 1,340 1,147 186 4
కేరళ
1,270 670 590 10
ఉత్తరాఖండ్ 907 797 102 5
ఝార్ఖండ్ 635 374 256 5
ఛత్తీస్ గఢ్ 5503 388 114 1
హిమాచల్ ప్రదేశ్
330 212 109 6
త్రిపుర
316 143 173 0
ఛండీగఢ్ 293 90 199 4
లడఖ్ 77 30 47 0
గోవా
71 27 44 0
మణిపూర్ 71 60 11 0
పుదుచ్చేరీ 70 45 25 0
నాగాలాండ్ 43 43 0 0
అండమాన్ నికోబార్ దీవులు 33 0 33 0
మేఘాలయ 27 14 12 1
అరుణాచల్ ప్రదేశ్ 4 3 1 0
దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూ 2 1 1 0
మిజోరం
1 0 1 0
సిక్కిం 1 1 0 0
మొత్తం 1,90,791 93,517 91,855 5,408
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News