Tuesday, February 7, 2023

బాహుబలి అవతారమెత్తిన ఉత్తరాఖండ్ సిఎం (వీడియో)

- Advertisement -

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ బాహుబలి అవతారమెత్తారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రయోగాలకు కూడా దిగితున్నారు. అయితే ప్రధాని మోడీకి తామేం తక్కువ కాదు అని నిరూపించుకొనేందుకు ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రితో ఈ అవతారమెత్తించారు. అయితే అది నిజంగా కాదు.. కేవలం ప్రచారం కోసం చేసిన ఓ మార్ఫింగ్ వీడియోలో మాత్రమే…
బాహుబలి మొదటి భాగంలో సూపర్ హిట్ అయిన ‘శివుని ఆన’ పాటతో బాహుబలి 2 పేరిట ఉత్తరాఖండ్‌లో ఓ వీడియోను విడుదల చేశారు. ఈ పాటలో రాష్ట్ర ముఖ్యమంత్రి హరీశ్ రావత్ బాహుబలి పాత్రలో కనిపిస్తారు. ఇక ఈ వీడియోలు కొందరు స్థానిక కాంగ్రెస్ నేతతో పాటు, బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా, పాటలో తనికెళ్ల భరణి పాత్రలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా కనిపిస్తారు. ఈ పాటను రావత్ ఆయన సోషల్ మీడియా ఖాతాలో విడుదల చేశారు. ఉత్తరాఖండ్ పోరాట యోధుడు హరీశ రావత్ అని టైటిల్ పడుతుండగా పాట మొదలవుతుంది. అక్కడి ప్రసిద్ధమైన ప్రాంతాల చిత్రాలు పాట ప్రారంభంలో కనిపిస్తాయి.. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరే వీడియో చూడండీ….

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles