Friday, April 19, 2024

ఆ 136 మంది చనిపోయినట్లే!

- Advertisement -
- Advertisement -

ఆ 136 మంది చనిపోయినట్లే!
చమోలి జలప్రళయంలో గల్లంతైన వారిపై అధికారుల అంచనా
అధికారికంగా ప్రకటించనున్న ఉత్తరాఖండ్ ప్రభుత్వం

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో సంభవించిన జలప్రళయం సంభవించి పక్షం రోజులు గడిచిపోయినా ఈ వరదల్లో గల్లంతయిన వారి జాడ ఇంకా తెలియరాలేదు. దీంతో వారంతా చనిపోయి ఉంటారని అధికారులు, సహాయక సిబ్బంది భావిస్తున్నారు. గల్లంతయిన వారిని ‘చనిపోయినట్లుగా భావిస్తున్నాం’అని ప్రకటించేందుకు ఆ రాష్ట్రప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించింది.ఈ మేరకు తాజాగా ఒక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈనెల 7న ధౌలిగంగాలో మంచుచరియలు విరిగిపడడంతో నది ఉప్పొంగి ఆకస్మిక వరదలు సంభవించడం తెలిసిందే. ఈ జల విలయానికి ఒక విద్యుత్ కేంద్రంతో పాటుగా అయిదు వంతెనలు కొట్టుకు పోగా మరో విద్యుత్ కేంద్రం తీవ్రంగా దెబ్బతింది. ఈ వరదల్లో 204 మంది గల్లంతయ్యారు.

వీరిలో ఇప్పటివరకు 68 మృతదేహాలను గుర్తించారు. ఒక్క తపోవన్ సొరంగంలోనే 14 మృతదేహాలు లభ్యమైనాయి. ఇంకా 136 మంది ఆచూకీ తెలియరాలేదు. ప్రమాదం జరిగి రెండు వారాలు దాటిపోయినా వీరి జాడ తెలియనందున వారంతా చనిపోయి ఉంటారని అధికారులు చెబుతున్నారు. వారికి సంబంధించి కుటుంబ సభ్యులకు మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్లు జారీ చేయాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం 1969 నాటి జనన, మరణ ధ్రువీకరణ చట్టంలోని నిబంధనలను ఉపయోగించుకోవాలని యోచిస్తోంది.

Uttarakhand flash floods:136 missing to be declared dead

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News