Home లైఫ్ స్టైల్ శిశు మరణాల రేటు ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువ

శిశు మరణాల రేటు ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువ

indian-mother-newborn-baby

దేశంలోనే అత్యంత జనాభా కలిగిన రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్. శిశు మరణాల రేటులో మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌ల రికార్డును బద్దలుకొట్టి ముందునిలిచింది ఈ రాష్ట్రం. కొత్తగా వెలువరించిన ఆరోగ్య వివరాల(నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే2015-16) ప్రకారం నమోదైన సంఖ్య ఇది. గతంలో ప్రతి వెయ్యి శిశువుల్లో 73 మరణాలుగా ఉన్న సంఖ్య నేడు 64కు చేరింది, పరిస్థితి గతంకంటే కొంత మెరుగయ్యిందనే చెప్పవచ్చు. గత పది సంవత్సరాల నుంచి 2016 వరకు నమోదు చేసిన వివరాల ప్రకారం ఏర్పడిన మార్పు ఇది.
పశ్చిమ ఆఫ్రికాలోని దేశమైన మ్యురిటేనియా లో ఈ సంఖ్య 65 గా ఉంది. అత్యంత పేద దేశమైన బుర్కినా ఫాసో(ఆఫ్రికా) లొ శిశుమరణాల రేటు 61 గా ఉండి, ఆరోగ్యపరంగా ఉత్తరప్రదేశ్ కంటే మెరుగైన స్థానాన్ని సొంతం చేసుకున్నది. ఈ సంఖ్య అఫ్ఘనిస్తాన్‌లో 66 గా ఉంది. సర్వే ప్రకారం ఐదు సంవత్సరాల లోపు వయసు పిల్లల మరణాలు కూడా ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కువగా నమోదయ్యాయి. ప్రతి వెయ్యి మంది ఐదు సంవత్సరాలలోపు చిన్నారుల్లో 78 మంది మృత్యువాత పడుతున్నారు. మన దేశ స్థూల జాతీయోత్పత్తి సగటులో సగం మాత్రమే ఉండే ఆఫ్రికాలోని దేశమైన మొజాంబిక్ లో 96 గా ఉన్న సంఖ్య గత పదేళ్లలో తగ్గుముఖం పట్టి 79 కి చేరింది. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం సగటున 452 రూపాయలు ఆరోగ్యంపై ఖర్చు చేస్తున్నది, దేశ సగటుతో పోలిస్తే 70 శాతం తక్కువ. ప్రతి ఇద్దరు పిల్లల్లో ఒకరు వ్యాధి నిరోధక టీకాలు పూర్తిగా వేయించుకోనివారే. మాతృ మరణాల్లో దేశంలోనే (లక్ష మందిలో 258 మంది మరణిస్తున్నారు) రెండో స్థానంలో ఉంది.
కేరళ, గోవా, తమిళనాడు, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ లలో ఈ సంఖ్య చాలా తక్కువగా ఉండి అమెరికా, ఇరాన్, అల్జీరియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియాల సరసన నిలిచాయి. ఐదు సంవత్సరాల లోపు పిల్లల మరణాల రేటులో కేరళ, గోవా, మణిపూర్, తమిళనాడు, మహారాష్ట్ర ల్లో తక్కువగా నమోదు చేసుకుని అమెరికా, ఇరాక్, ఇండోనేషియా, బ్రెజిల్‌లతో సమానంగా నిలిచాయి.