Home తాజా వార్తలు తపన, అంకిత భావం ఉన్న వాళ్లను ఫిల్మ్ ఇండస్ట్రీ నిరాశ పరచదు

తపన, అంకిత భావం ఉన్న వాళ్లను ఫిల్మ్ ఇండస్ట్రీ నిరాశ పరచదు

Mayukha Acting School

 

నటన అనే కళ దైవదత్తమే అయినప్పటికీ దానికి శిక్షణ అవసరమని ప్రముఖ దర్శకులు ఎస్.వి.కృష్ణారెడ్డి అన్నారు. నటుడు, రచయిత, యాక్టింగ్ కోచ్ ఉత్తేజ్‌కు చెందిన మయూఖ యాక్టింగ్ స్కూల్ సెకండ్ బ్యాచ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్.వి. కృష్ణారెడ్డి మాట్లాడుతూ “నటుడు అనేవాడు తన మాతృభాష కే పరిమితం కాకుండా వీలైనన్ని ఇతర భాషలను కూడా నేర్చుకునేందుకు ప్రయత్నించాలి. అప్పుడే ప్రకాష్ రాజ్ లాగా బహుభాషా నటుడిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కొత్తగా శిక్షణ ప్రారంభిస్తున్న యాక్టింగ్ స్టూడెంట్స్ అందరికీ ఈ మయూఖ యాక్టింగ్ స్కూల్ ద్వారా ఉజ్వల భవిష్యత్తు ఏర్పడాలని కోరుకుంటున్నాను”అని అన్నారు.

సీనియర్ నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ “ఉత్తేజ్ నాకు చిన్నప్పటి నుండి తెలుసు. తను స్థాపించిన మయుఖ యాక్టింగ్ స్కూల్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మంచి నటీనటులను అందిస్తుందనడంలో సందేహం లేదు. తపన, అంకిత భావం ఉన్న వాళ్లను ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడూ నిరాశ పరచదు”అని తెలిపారు. ఉత్తేజ్ మాట్లాడుతూ “ఫస్ట్ బ్యాచ్‌కి వీడ్కోలు చెబుతున్నందుకు బాధగా… సెకండ్ బ్యాచ్‌ని ప్రారంభిస్తున్న నందుకు ఆనందంగా ఉంది. ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ ఇప్పటికే వెబ్ సిరీస్‌లలో, కొన్ని సినిమాల్లో, కొన్ని సీరియల్స్‌లో నటిస్తున్నారు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నటి,యాంకర్ ఝాన్సీ, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు తదితరులు పాల్గొన్నారు.

Uttej Mayukha Acting School Second Batch Launch