Home తాజా వార్తలు పవన్‌పై విహెచ్ మండిపాటు…

పవన్‌పై విహెచ్ మండిపాటు…

VH-and-Pawan-Kalyan

హైదరాబాద్: జనసేనాని పవన్ కల్యాణ్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం చంచల్‌గూడ జైలులో ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను కలిసి పరామర్శించిన అనంతరం విహెచ్ విలేకర్లతో మాట్లాడారు. ప్రజల కోసం పోరాడుతున్న నేతలను కారాగారంలో పెట్టిన సిఎం కెసిఆర్‌కు ప్రజలే బుద్ధిచెబుతారన్నారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుంటే కెసిఆర్‌ని పవన్ ఆకాశానికెత్తేయడం ఎంతవరకు సమంజసమని విహెచ్ ప్రశ్నించారు. ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్‌ను విమర్శించిన పవన్ నేడు మంచి దక్షత గల ముఖ్యమంత్రి అని ఎలా చెబుతున్నారో తమకు చెప్పాలన్నారు. పవన్ కల్యాణ్ అసలు రాజకీయ నాయకుడే కాదన్నారు. ఆయనకు దళితులంటే బొత్తిగా తెలియదంటూ విహెచ్ చూరకలంటించారు. అంతేగాక పవన్ తెలుగు రాష్ట్రాల సిఎంలు కెసిఆర్, చంద్రబాబుకు ఓ తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు.

V Hanumantha Rao Criticizes Janasena Party Chief Pawan Kalyan.