Saturday, April 20, 2024

పెద్ద ఉద్యమం చేయాలి: విహెచ్

- Advertisement -
- Advertisement -

V Hanumantha Rao holds press meet at Gandhi Bhavan

హైదరాబాద్: ప్రభుత్వ సంస్థలను కాపాడుకోవడానికి పెద్దఉద్యమం చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. గాంధీభవన్‌లో మీడియాతో మంగళవారం ఆయన మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అమ్మేస్తున్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారన్నారు. విశాఖ స్టీల్ భూములు కోట్ల రూపాయలు పలుకుతున్నాయని, ఆదానీ, అంబానీలతో మోడీ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారని విహెచ్ ఆరోపించారు. ప్రైవేటు కంపెనీలలో రిజర్వేషన్లు ఉండవని, రేపు బిహెచ్‌ఇఎల్, ఈసిఐఎల్ అమ్మేస్తారని కేంద్రంపై విహెచ్ ధ్వజమెత్తారు. ఒక రకంగా చెప్పాలంటే మోడీ రిమోట్ కంట్రోల్ ఆదానీ, అంబానీ చేతిలో ఉందని విహెచ్ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిం చారు. విశాఖ ఉక్కును కాపాడుకోకపోతే ప్రజలు క్షమించరని, కాంగ్రెస్ పెద్ద ఉద్యమం చేయాలని.. లేకపోతే భవిష్యత్ తరాలు క్షమించవని విహెచ్ అన్నారు.

V Hanumantha Rao holds press meet at Gandhi Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News