Wednesday, November 6, 2024

విలక్షణ నటుడిగా దూసుకుపోతున్న వి.కె.నరేష్

- Advertisement -
- Advertisement -

V K Naresh birthday celebration

 

‘ప్రేమ సంకెళ్లు’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా ప్రవేశించి దాదాపు వందకు పైగా చిత్రాల్లో హీరోగా నటించిన వి.కె.నరేష్ ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా 150 చిత్రాలకు పైగా నటించి సక్సెస్‌ఫుల్‌గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా తనవంతు భాద్యతలు సక్రమంగా నిర్వహిస్తున్న డా.నరేష్ వి.కె. బుధవారం తన పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు. ఆయన పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్‌లో అభిమానులు, శ్రేయోభిలాషులు మధ్య ఆడంబరంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో న్యూ మంక్స్ కుంగుఫూ అసోసియేషన్‌ను తెలంగాణలో ప్రారంభించి దీనికి నరేష్‌ను అధ్యక్షునిగా నియమించారు. అలాగే ఈ కార్యక్రమంలో 2021 సంవత్సరానికి గాను 9వ యాన్యువల్ బుద్ధ బోధి ధర్మ అవార్డ్‌ని ప్రముఖ సినీ నటులకు రాష్ట్రమంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో బుద్ధ బోధి ధర్మ అవార్డు గ్రహీతలు ఇంద్రగంటి మోహనకృష్ణ, ఆలీ, రాజీవ్ కనకాల, సాంసృతిక వేత్త ధర్మారావు, పవిత్ర లోకేష్, టార్జాన్, యం. అశోక్ కుమార్, గణేష్, గౌతమ్ రాజు, కరాటే కల్యాణి, జాకీ, కృష్ణమోహన్, శ్రీనివాసులు పసునూరి, శ్రీపురం కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వి.కె.నరేష్ మాట్లాడుతూ “కరోనా సమయంలో కమిట్ అయిన 11 చిత్రాలు పూర్తి చేశాను. ప్రస్తుతం ఒక పది చిత్రాల్లో డిఫరెంట్ వెరీయేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తున్నాను. అందులో ఒకటి నేను, ఆలీ హీరోలుగా చేస్తున్న ‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’ సినిమా షూటింగ్ జరుగుతోంది”అని అన్నారు. రాష్ట్ర మంత్రి జి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ “రాష్ట్రంలో సినిమా షూటింగ్‌లకు అందమైన లొకేషన్స్ ఉన్నాయి. మంత్రి కేటీఆర్ సహకారంతో అతి తక్కువ ధరకు లొకేషన్స్ ఇచ్చి సినిమా రంగాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్లడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది”అని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News