- Advertisement -
ముంబై: ఒత్తిడిలోనూ నిలకడగా ఆడడం భారత స్టార్ రోహిత్ శర్మ ప్రత్యేకత అని అదే అతని సక్సెస్‌కు ప్రధాన కారణమని టీమిండియా మాజీ క్రికెటర్, హైదరాబాదీ స్టయిలీష్ బ్యాట్స్‌మన్ వివిఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. కెప్టెన్‌గా ముంబై ఇండియన్స్‌కు నాలుగు ఐపిఎల్ ట్రోఫీలు అందించిన ఘనత ఒక్క రోహిత్‌కు మాత్రమే దక్కుతుందన్నాడు. అంతేగాక ఐపిఎల్ ట్రోఫీని సాధించిన డెక్కన్ ఛార్జర్స్ జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడని లక్ష్మణ్ గుర్తు చేశాడు. ఐపిఎల్ ఆరంభ సీజన్ నుంచే రోహిత్ ఒత్తిడిని తట్టుకుని నిలబడడంలో సక్సెస్ అయ్యాడన్నాడు. రానురాను అతని బ్యాటింగ్‌లో ఎంతో మార్పు వచ్చిందన్నాడు. ఒత్తిడిని సయితం తట్టుకుని ముందుకు సాగడంలో ఎంతో పరిణితి సాధించాడన్నాడు. ఇదే అతన్ని విజయవంతమైన బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా మార్చిందని లక్ష్మణ్ పేర్కొన్నాడు.
- Advertisement -