Tuesday, April 23, 2024

24 గంటల్లో 62,581 మందికి టీకా

- Advertisement -
- Advertisement -

Vaccinated 62581 people in 24 hours in Telangana

హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 62,581 మందికి వ్యాక్సిన్ వేశారు. వీరిలో 59,439 ఫస్ట్, 3142 మంది సెకండ్ డోసు వేసుకున్నట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. అయితే వీరెవ్వరికీ రీయాక్షన్లు రాలేదని అధికారులు ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు 2,26,722 మంది హెల్త్‌కేర్ వర్కర్లు తొలి డోసు తీసుకోగా, 1,70,604 మంది రెండో డోసు తీసుకున్నారు. అదే విధంగా 11,69,29 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు మొదటి డోసు తీసుకోగా, 66,256 మంది సెకండ్ డోసు వేసుకున్నారు. అంతేగాక 4,68,253 వృద్ధులు, 2,72,525 మంది 45 నుంచి 59 ఏళ్ల మధ్యగల దీర్ఘకాలిక వయస్కులు టీకా తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 13,26,607 మందికి వ్యాక్సిన్ వేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.

3.02 శాతానికి పెరిగిన వ్యాక్సిన్ వేస్టేజ్….

రాష్ట్రంలో వ్యాక్సిన్ వేస్టేజ్ 3.02 శాతానికి పెరిగింది. కొవిన్ పోర్టల్‌లో కొవిన్ పోర్టల్ లెక్కల ప్రకారం 14,42,370 ఉండాల్సి ఉంటే, ఆర్మీ సిబ్బంది పంపిణీకి 40,540, బఫర్ స్టాక్ కింద 32,120 డోసులను తీసివేస్తే వృథా శాతం 3.02 శాతం రికార్డు అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా టీకా పొందే వారి సంఖ్యతో పాటు డోసుల వృథా కూడా పెరుగుతున్నట్లు అధికారిక బులిటెన్‌లో పేర్కొన్నారు. లబ్ధిదారులు సకాలంలో సెంటర్లకు రాకపోవడంతో, నిల్వ, రవాణా సమయంలో కొన్ని వయల్స్‌లోని డోసులు వేస్ట్ అవుతున్నాయని ఆరోగ్యశాఖ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News