Friday, April 19, 2024

50 ఏళ్లు పైబడిన వారికి మార్చిలో టీకాలు

- Advertisement -
- Advertisement -

Vaccination in March for those over 50 years of age

50 లక్షలమందికి వ్యాక్సినేషన్ పూర్తి

న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్19 కట్టడికి చేపట్టిన వ్యాక్సినేషన్‌లో భాగంగా మూడోదశ టీకాల కార్యక్రమం మార్చిలో ప్రారంభమవుతుందని ఆరోగ్యశాఖమంత్రి హర్షవర్ధన్ లోక్‌సభకు తెలిపారు. మూడో దశలో 50, ఆపై వయసువారితోపాటు, ఆలోపు వయసులోని ఇతర వ్యాధులతో బాధపడేవారికి టీకాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. వీరి సంఖ్య 27 కోట్లు ఉం టుందన్నారు. అయితే, మూడోదశ మార్చిలో ఏ తేదీ నుంచి మొదలయ్యేది కచ్చితంగా ఇప్పుడే చెప్పలేనని హర్షవర్ధన్ అన్నారు. ఇప్పటివరకు దేశంలోని 50 లక్షలమందికి టీకా మొదటి డోస్ పూర్తయినట్టు హర్షవర్ధన్ తెలిపారు. ఈ వారంలో మొదటి వరుసయోధులకు టీకాలు ప్రారంభిస్తామని తెలిపారు.

జనవరి 16న దేశవ్యాప్తంగా టీకాల కార్యక్రమం ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదటి ప్రాధాన్యత ఆరోగ్య కార్యకర్తలకివ్వగా, రెండో ప్రాధాన్యత ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కిచ్చారు. రెండుదశల్లో టీకాలు పొందేవారి సంఖ్య మూడు కోట్ల వరకు ఉంటుందని అంచనా. వ్యాక్సినేషన్ కోసం ఆర్థికమంత్రి ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.35,000 కోట్లు కేటాయించారు. అవసరమైతే కేటాయింపుల్ని పెంచనున్నట్టు తెలిపారని హర్షవర్ధన్ గుర్తు చేశారు. ప్రస్తుతం వ్యాక్సినేషన్ కోసం కోవీషీల్డ్, కొవాగ్జిన్‌లకు అత్యవసర అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. మరో ఏడు వ్యాక్సిన్లు లైన్‌లో ఉన్నాయని తెలిపారు. వీటిలో మూడు మూడోదశ క్లినికల్ ట్రయల్స్ జరుపుకుంటున్నాయన్నారు. మరో రెండు 1,2 క్లినికల్ దశల్లో, ఇంకో రెండు అడ్వాన్స్‌డ్ ప్రీక్లినికల్ దశలో ఉన్నట్టు తెలిపారు. వ్యాక్సిన్ల కోసం 22 దేశాల నుంచి అభ్యర్థనలున్నాయని తెలిపారు. ఇప్పటికే 15 దేశాలకు వ్యాక్సిన్లు సరఫరా చేశామన్నారు.

Vaccination in March for those over 50 years of age

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News