Home తాజా వార్తలు కరోనా వ్యాక్సినేషన్ ఉద్యమంలా నిర్వహించాలి

కరోనా వ్యాక్సినేషన్ ఉద్యమంలా నిర్వహించాలి

Vaccination should be carried out as movement

 

రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తి
222 బృందాల ద్వారా జిల్లాలో వ్యాక్సినేషన్ నిర్వహణ
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

మనతెలంగాణ/పెద్దపల్లి : జిల్లాలో ఉద్యమంలా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్‌పై మంత్రి ఆదివారం ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో విసి ద్వారా సమీక్షించారు. సిఎం కెసిఆర్ ఆదేశాలతో తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేశామని మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాలో వ్యాక్సినేషన్ విజయవంతంగా నిర్వహించడంతో స్థానిక ప్రజాప్రతినిధులు సంపూర్ణ సహకారం అందించాలని మంత్రి కోరారు. కరోనా నుండి తెలంగాణన ప్రజలను కాపాడుకోవడానికి రోజుకు 3 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చేలా సిఎం కెసిఆర్ స్పెషల్ డ్రైవ్ చేపట్టారని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతం చేయడంలో ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని మంత్రి సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధుదలు సమన్వయంతో పనిచేసి చివరి మనిషి వరకు వ్యాక్సిన్ అందించాలని మంత్రి తెలిపారు.

ప్రతి గ్రామం, వార్డు పరిధిలో ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాల నిర్వహణపై అవగాహన కల్పించాలని, ప్రజలు వ్యాక్సిన్ తీసుకునేలా స్థానిక ప్రజాప్రతినిధులు పనిచేయాలని మంత్రి ఆదేశించారు. వ్యాక్సినేషన్ తీసుకున్న తరువాత కరోనా వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయని, వ్యాక్సినేషన్ అనంతరం కరోనా వచ్చినప్పటికి ప్రాణాలకు ఎలాంటి అపాయం ఉండదని, ఈ అంశాన్ని ప్రజల్లోకి విస్త్రృతంగా తీసుకునే విధంగా వారికి అవగాహన కల్పించాలని, ప్రజలలో ఉన్న అపోహలను దూరం చేయాలని, డాక్టర్ బృందాలతో అవగాహన నిర్వహించాలని మంత్రి సూచించారు. ప్రత్యేక క్యాంపుల వద్ద అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకొవాలని, ప్రతి 3 వ్యాక్సినేషన్ కేంద్రాలకు ఒక డాక్టర్ పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. జిల్లాలోని ప్రజలందరికి వ్యాక్సినేషన్ అందించడం కోసం నిర్విరామంగా కృషి చేసిన వైద్యాధికారులు, వివిధ శాఖల సిబ్బందిని మంత్రి అభినందిస్తూ, ఈ స్ఫూర్తి ఇదే విధంగా కొనసాగించాలని తెలిపారు.

జిల్లాలో 100 శాతం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్‌కు కృషి : లూక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ, జిల్లాలో 100 శాతం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ అందించేందుకు 222 (118 పట్టణ, 104 గ్రామీణ) బృందాలతో ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామ ని తెలిపారు. జిల్లాలో దాదాపు 5.5 లక్షల మందికి పైగా ప్రజలు 18 సం వత్సరాలపై వయస్సు వారు ఉన్నారని, వీరిలో 451138 మందికి మొద టి డోస్ వ్యాక్సినేషన్ పూర్తి చేశామని తెలిపారు. సెప్టెంబర్ 17 నుంచి ని ర్వహిస్తున్న ప్రత్యేక వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌లో ప్రతి రోజు 13 వేల మం దికి వ్యాక్సినేషన్ అందిస్తున్నామని తెలిపారు.

సబ్ సెంటర్ పరిధిలో ఉన్న గ్రామాలో, షెడ్యూల్ ప్రకారం ప్రత్యేక వ్యాక్సిన్ క్యాంపులు నిర్వహిస్తామని, సదరు షెడ్యుల్ సంబంధిత సమాచారం స్థానిక ప్రజాప్రతినిధికి అందించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఐకెపి, అంగన్వాడీ, ఆశాలతో బృందాలు ఏర్పాటు చేసి ఇంటింటికి తిరిగి వ్యాక్సినేషన్ కాని వారి ని గుర్తిస్తున్నామని, ప్రతి ఇంటిపై వ్యాక్సినేషన్ స్టిక్కర్ అతికించాలని కలెక్టర్ సూచించారు. ఈ వీసీలో పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే కోరుకం టి చందర్, జిల్లా వైద్యశాఖ అదికారి డాక్టర్ ప్రమోద్‌కుమార్, రామగుం డం మేయర్ డాక్టర్ అనిల్ కుమార్, పెద్దపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ మమతారెడ్డి, మంథని మున్సిపల్ చైర్‌పర్సన్ పుట్ట శైలజ, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్‌లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

vaccination should be carried out as movement