Home జాతీయ వార్తలు భారత్ లో 24,27,26,693 మందికి టీకాలు

భారత్ లో 24,27,26,693 మందికి టీకాలు

Vaccines For 242726693 People In Indiaన్యూఢిల్లీ : భారత్ లో కరోనా టీకా డ్రైవ్ చురుకుగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 24,27,26,693 కోట్ల మందికి టీకాలు వేసినట్టు ద్ర, కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ అధికారులు గురువారం మీడియాకు తెలిపారు. గడిచిన 24 గంటల్లో 33,79,261 మందికి టీకాలు వేసినట్టు వారు వెల్లడించారు.   గురువారం ఉదయం 7 గంటల వరకు అందించిన సమాచారం మేరకు 33,82,775 సెషన్ల మొత్తం 24,27,26,693 టీకా డోసులు వేసినట్లు అధికారులు పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో భారత్ కొత్తగా 94,052 కేసులు నమోదయ్యాయని, వరుసగా లక్ష కన్నా తక్కువగా నమోదవడం ఇది మూడోసారని అధికారులు చెప్పారు. ప్రస్తుతం భారత్ లో 11,67,952 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని వారు తెలిపారు. జాతీయ రికవరీ రేటు 94.77శాతంగా ఉందని , వారాంతపు పాజిటివిటీ రేటు ప్రస్తుతం 5.43శాతంగా ఉందని, రోజువారీ పాజిటివిటీ రేటు 4.69శాతానికి పడిపోయిందని అధికారులు స్పష్టం చేశారు.