Friday, April 26, 2024

రాజ్యసభకు రవి ఏకగ్రీవం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాజ్యసభ టిఆర్‌ఎస్ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి వద్దిరాజు రవిచంద్ర ఎన్నిక పత్రాన్ని స్వీకరించారు. రాజ్యసభ ఉప ఎన్నికకు నా మినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం తో ముగిసింది. ఉపఎన్నిక బరిలో వద్దిరాజు రవిచంద్ర మాత్రమే మిగలడంతో ఆయన ఎ న్నిక ఏకగ్రీవమైంది. సమాజ్‌వాదీ పార్టీకి చెం దిన జాజుల భాస్కర్, స్వతంత్ర అభ్యర్థి భోర జ్ కొయాల్కర్ నామినేషన్లు సక్రమంగా లేని కారణంగా వారి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ఎవరూ పోటీలో లేక పోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది.

ప్రస్తుతం ఎంఎల్‌సిగా ఉన్న బండా ప్రకా శ్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామాతో ఈ స్థానానికి జరిగిన ఉపఎన్నికకు రవిచంద్ర ఏ కగ్రీవంగా ఎన్నికయ్యారు. గాయత్రి రవి 2024 ఏప్రిల్ వరకు రెండేళ్లు రాజ్యసభ స భ్యుడిగా కొనసాగనున్నారు. మిగతా రెండు రాజ్యసభ స్థానాలకు మంగళవారం నోటిఫికే షన్ విడుదల కానుంది. డి.శ్రీనివాస్, లక్ష్మీ కాంతరావు స్థానంలో రాజ్యసభ స్థానాల ఉప ఎన్నికకు ఈ నెల 24 నుంచి 31 వరకు నా మినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. టిఆర్‌ఎస్ అభ్యర్థులుగా పార్థసారథి రెడ్డి, దామోదర్ రావు నామినేషన్ వేయనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News