*గురువారం తెల్లవారు జామున చెర్వుగట్టు స్వామి వారి కల్యాణం
*యదాద్రిలో పాతగుట్ట జాతర ప్రారంభం
*అధిక సంఖ్యలో హాజరు కానున్న భక్తులు
నల్లగొండ జిల్లాలో బ్రహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు ముస్తాభైంది. ఈ సందర్భంగా ధగధగలాడే విద్యుత్ దీపాలు, పలు రకాల పూలతో ఆలయాన్ని ముస్తాబు చేశారు. గురువారం తెల్లవారు జామున జరుగు స్వామి వారి కల్యాణానికి మండపాన్ని సిద్ధం చేశారు. ఈ బ్రహ్మోత్సవాలను ఎమ్మెల్యేతో పాటు అటవీశాఖ అభివృద్ధి చెర్మన్ బండా నరేందర్ రెడ్డి బుధవారం ప్రారంభించారు.
యాదాద్రి పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (జాతర) వైభవంగా ప్రారంభం అయినాయి. యాదాద్రి అనుబంధ ఆలయమైన శ్రీపాతలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహోత్సవాలు ఆలయంలో శాస్త్రో క్త పూజలను చేసి స్వస్తివాచనం, రక్షాబంధనం, పుణ్యాహావాచనం
నిర్వహించారు. మనతెలంగాణ/యాదాద్రి: పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షి బ్రహ్మోత్సవాలు (జాతర) వైభవంగా ప్రారంభం అయినాయి. వారం రోజులు జరగనున్నా శ్రీ వారి బ్రహ్మోత్సవ ఉత్సవాలను తొలి రోజు స్వస్తీవచనంతో శాస్త్రోక్త పూజలను వేదపండితులు, అర్చకులు జరిపించి మొదలు పెట్టారు. బుధవారం రోజున యాదాద్రి అనుభంద ఆలయమైన శ్రీపాతలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహోత్సవాలు ఆలయంలో శాత్రోత్త పూజలను నిర్వహించి స్వస్తీవచనం, రక్షాబందనం, పుణ్యహావాచనం నిర్వహించి పారాయణికులచే మూల మంత్ర వేద ప్రభందనాలను పారాయణము గావించి ఆగమశాస్త్రముగా శ్రీ వారి బ్రహోత్సవాలను శ్రీకారం చుట్టారు. ఉదయం ఆలయంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి వారులకు ప్రత్యేకపూజలు, అభిషేకాలను నిర్వహించి పట్టు వస్త్రాలు, ఆభరణాలతో అలంకరించి విజ్ఞాచార్యులు, అర్చకులు వేదమంత్రాలను ఉచ్చరిస్తూ లోకరక్షణకై స్వస్తీ వచన వేడుకను నిర్వహించి స్వామివారి బ్రహోత్సవాలకు ఎటువంటి ఆటంకాలు కల్గకుండా వచ్చే భక్తులను ఆశీర్వదిస్తూ రక్షబందన పూజా కార్యక్రమాన్ని అర్చకస్వాములు నిర్వహించారు. బ్రహోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో అర్చక స్వాములు మంత్ర జలాలను చల్లి శుద్ధి పరిచిన సాయంకాలం శ్రీవారి ఆలయం లో నిత్యపారాయణములు, సామూహిక విష్ణు సహస్రనా మ పారాయములు గావించి అంకురారోపణ మృత్యం గ్రహణ వేడుకలను శ్రీపంచారాత్రాగమ శాస్త్ర రిత్యా నిర్వహించారు. ఉత్సవాల ప్రారంభమోత్సవ, స్వామివారి అలంకార సేవ,కళ్యాణ విశిష్టతను యజ్ఞాచార్యులు, అర్చకులు భక్తులకు తెలియజేశారు. ఈ బ్రహోత్సవ ప్రారంభ వేడుకలో యజ్ఞాచార్యులు, ప్రధాన అర్చకులు నల్లందిగల్ లక్ష్మీనరసింహచార్యులు, సంపతాచార్యులు, ఆలయ చైర్మన్ బి.నరసింహమూర్తి, ఈవో గీత,ఆలయ సిబ్బంది, భక్తులు, అర్చక స్వాములు తదితరులు పాల్గొన్నారు.
చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వ స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలు ప్రారంభం
మన తెలంగాణ/నార్కట్‌పల్లి: తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రంగా చెర్వుగట్టు విరాజిల్లుతుందని ఎంఎల్‌ఎ వేముల వీరేశం అన్నారు. మండలంలోని చెర్వుగట్టులో శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలను ఎంఎల్‌ఎతోపాటు అటవీశాఖ అభివృద్ధి చైర్మన్ బండా నరేందర్ రెడ్డి,కలిసి బుధవారం ప్రారంభించారు.బ్రహ్మోత్సవాల్లో భాగంగా కలశ ప్రతిష్ట కార్యక్రమం లో పాల్గొని పూజలు చేశారు.పూర్ణాహూతి,జీవన్యాసం, ద్వాదశ నదీజలాలతో కుంబాభిషేకాలు నిర్వహించారు. బ్రహ్మశ్రీ అల్లవరపు సుబ్రహ్మణ్య దీక్షితావధాని, ప్రధాన అర్చకులు పోతులపాటి రామంలిగేశ్వరశర్మ ఆధ్వర్యంలో విఘ్నేశ్వర పూజ,మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రభిషే కాలను నిర్వహించారు.ముందుగా ఆలయ సంప్రదాయం ప్రకారం దేవలయ చైర్మన్ నల్ల వెంకన్న ఈవో సైకం అంజనా రెడ్డి పూర్ణ కుంభంతో ఎదురేగి మంగళవాయిద్యాలతో వేదపండితులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ.ముఖ్యమంత్రి కేసీఆర్ దేవాలయ అభివృద్ధికి అధిక ప్రాధ్యాన్యమిస్తున్నారని అన్నారు.గత పాలకులు ఉమ్మడి రాష్ట్రంలో దేవాలయాల్లో జరిగే బ్రహ్మోత్సవాలకు ఎలాంటి నిధులు కేటాయించలేదని తెలిపారు..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్ర భ్వుతమే బ్రహ్మోత్సవాలను అధికారికంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు కేటాయించారని చెప్పారు.చెర్వుగట్టు దేవస్థానం అభివృద్ధికి మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులను కేటాయించి వచ్చే బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానిస్తామని అన్నారు.దేవాలయం పైకి రెండో ఘాట్‌రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పా రు.ఈ కార్యక్రమంలో ఎంపిపి రేగట్టె మల్లిఖార్జున్ రెడ్డి, దేవాలయ శాఖ కమిషనర్ సులోచన,సర్పంచ్ మల్గు రమ ణ బాలకృష్ణ, పాలక వర్గం సభ్యులు బాల బిక్షం,మేకల వెంకట్‌రెడ్డి,రేగట్టే నర్సింహ్మ రెడ్డి,మర్రి నర్సింహ్మ,గద్దే లతీఫ్,మోహన్ రెడ్డి, నాంపల్లి శ్రీను,రాదరపు విజలక్ష్మి, గడ్డం పశుపతి, గౌలికర్ శ్రీను, యామ దయాకర్, కనుక సహిని, కోలోజు శ్రీనువాస్ తదితరులు పాల్గొన్నారు.