Monday, June 24, 2024

క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్‌ రెండో చిత్రం..

- Advertisement -
- Advertisement -

పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక మొదలు పెట్టిన మొదటి చిత్రం ‘వకీల్ సాబ్’. ‘పింక్’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే, దీని తర్వాత దర్శకుడు క్రిష్‌తో పవన్ ఒక భారీ పీరియాడిక్ డ్రామా కూడా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు షూటింగ్స్ మళ్లీ మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు. దీంతో పవన్ కూడా మళ్లీ షూటింగ్‌లో పాల్గొనడం ఇప్పుడప్పుడే సాధ్యం కాదని స్వయంగా తెలిపాడు. ఇదిలా ఉండగా క్రిష్, పవన్ తో చేస్తున్న ప్రాజెక్ట్ కు ఊహించని మలుపు వచ్చింది. దర్శకుడు క్రిష్ ఇంకా ఈ ప్రాజెక్ట్ హోల్డ్‌లో ఉండగానే యువ హీరో వైష్ణవ్ తేజ్‌తో ఓ ప్రాజెక్ట్‌ను ఒప్పుకున్నాడు. దీంతో పవన్ చిత్రం ఏమైనట్టు అనే చర్చ మొదలైంది. కానీ ఇప్పుడు పవన్ ముందు ఒప్పుకున్న ‘వకీల్ సాబ్’ చిత్రం షూటింగ్ డిసెంబర్‌లో మొదలు కానుందట. ఇక అది పూర్తయిన తర్వాత మళ్లీ క్రిష్ సినిమా షూటింగ్‌లో ఈ స్టార్ హీరో చేరతాడు. అందుకే క్రిష్ ఈ గ్యాప్‌లో సింగిల్ షెడ్యూల్‌లో వైష్ణవ్ తేజ్‌తో సినిమాను ముగించాలనుకున్నాడు.

Vaishnav Tej 2nd Movie with Director Krish

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News