Home జాతీయ వార్తలు అటల్ జీ.. జీవితం దేశం కోసం అంకితం: మోడీ

అటల్ జీ.. జీవితం దేశం కోసం అంకితం: మోడీ

vajpayee dedicates his life for country says Pm Narendra modi

న్యూఢిల్లీ: దివంగత, మాజీ ప్రధాని వాజ్ పేయి ఎన్నో ఇబ్బందులను తట్టుకుని దేశానికి సేవ చేశారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేశారని ప్రధాని కొనియాడారు. ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో సోమవారం ఏర్పాటు చేసిన వాజ్ పేయి సంస్మరణ సభలో మోడీ మాట్లాడారు. నమ్మిన సిద్దాంతాల విషయంలో వాజ్ పేయి ఎప్పుడు రాజీపడలేదని చెప్పారు. దేశంలో 13 రోజులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినపుడు ఆయనకు ఎవరూ మద్దతివ్వలేదని తెలియజేశారు. రెజ్లర్ భజరంగ్ పూనియా తను సాధించిన బంగారు పతకాన్ని అటల్ జీకి అంకితమివ్వడం అతని వ్యక్తిత్వానికి నిదర్శమని ప్రధాని మోడీ అన్నారు. అనంతరం ఎల్ కె అద్వానీ మాట్లాడుతూ.. అటల్ జీ తో తనకు 65 ఏండ్ల స్నేహ బంధం ఉందన్నారు. తను వాజ్ పేయిను దగ్గర నుంచి గమనించానని చెప్పారు. ఆయనతో కలిసి చేశానని గుర్తుచేశారు. ఎన్నో అనుభవాలను పంచుకున్నానని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో తను అదృష్ణవంతుడిగా భావిస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు. వాజ్ పేయి సంస్మరణ సభకు ప్రధాని మోడీ, బిజెపి సీనియర్ నేత ఎల్ కే అద్వాని, కేంద్రమంత్రి రాజ్ నాథ్, మోహన్ భగవత్, వాజ్ పేయి దత్త పుత్రిక నమిత భట్టాచార్య, మనవరాలు నిహారికతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.