Friday, April 26, 2024

‘వ‌కీల్‌సాబ్’ ట్రైల‌ర్ కు ముహుర్తం ఫిక్స్..

- Advertisement -
- Advertisement -

పవర్ స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కిన తాజా చిత్రం ‘వ‌కీల్‌సాబ్‌’. వేణుశ్రీరామ్ దర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీని దిల్ రాజు, బోనీక‌పూర్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన శృతిహాసన్ నటిస్తుంది. తాజాగా, ఈ మూవీ ట్రైలర్ కు చిత్రయూనిట్ డేట్ ఫిక్స్ చేసింది. మార్చి 29న ట్రైలర్ ను విడుద‌ల చేయ‌నున్న‌ట్టు సోషల్ మీడియా ద్వారా చిత్రయూనిట్ ప్రకటించింది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. వచ్చే నెల 9న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో నివేదా థామ‌స్, అంజ‌లి, అనన్యలు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. హిందిలో సూపర్ హిట్ గా నిలిచిన ‘పింక్’ చిత్రానికి రీమేక్‌గా ‘వ‌కీల్‌సాబ్’ రూపొందిన విషయం తెలిసిందే.

‘Vakeel Saab’ Movie Trailer to release on March 29

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News