Friday, March 29, 2024

మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా…

- Advertisement -
- Advertisement -

Vakil Saab

 

పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ నటిస్తున్న తాజా సినిమా ‘వకీల్ సాబ్’. ఆదిత్య శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు-, బోనీకపూర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే టైటిల్ లాంచ్, పోస్టర్ లాంచ్ అంటూ ప్రమోషన్‌లో స్పీడ్ పెంచిన ఫిల్మ్‌మేకర్స్ ఈనెల 8న జాతీయ మహిళా దినోత్సవం కానుకగా మహిళామణులకు ఒక స్పెషల్ గిఫ్ట్‌ని సిద్ధం చేస్తున్నారు. ఇంతకీ ఏమా గిఫ్ట్ అంటే.. సింగింగ్ సెన్సేషన్ సిధ్ శ్రీరామ్ ఆలపించిన మహిళా మోటివేషన్ పాటను రిలీజ్ చేయనున్నారు. తాజాగా సాంగ్ టీజర్‌తో రుచి చూపించారు. “మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా.. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా”అంటూ చిన్న పాటి గ్లింప్స్‌ని వదిలారు.

ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. సిధ్ శ్రీరామ్ ఆలపించిన ఈ ట్యూన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈనెల 8న జాతీయ మహిళా దినోత్సవం కానుకగా ఈ పూర్తి పాటను విడుదల చేయనున్నారు. ఇక ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో ‘సామ జవర గమనా…’ అంటూ సిధ్ శ్రీరామ్ పాడిన పాట ఎలా దూసుకెళ్లిందో తెలిసిందే. అతడు ఏ పాట పాడినా అది రికార్డు బ్రేకింగే. యూత్‌లో అతడికి అంత ఫాలోయింగ్ ఉంది. ఇక పూర్తి స్థాయి ట్యూన్ వింటే కానీ .. ‘వకీల్ సాబ్’ మగువా… పాట ఏ స్థాయిలో ఉంటుందో చెప్పలేము.

Vakil Saab Prom Song Release
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News