Home తాజా వార్తలు ఊర మాస్ లుక్

ఊర మాస్ లుక్

ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15న కొత్త సినిమాల సందడితో పాటు రాబోయే వాటి పోస్టర్లు, టీజర్ల హడావిడి కూడా ఎక్కువగానే ఉండనుంది. వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వాల్మీకి’ టీజర్ అదే రోజున రాబోతోంది. ఈ సందర్భంగా వరుణ్‌తేజ్ రఫ్ లుక్స్‌ని రివీల్ చేస్తూ ఒక కొత్త పోస్టర్‌ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఊర మాస్ లుక్‌తో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో వరుణ్ మాములుగా లేరు. ఇప్పటిదాకా సాఫ్ట్ రోల్స్‌లో లవర్ బాయ్‌గా కనిపించిన వరుణ్‌ని ఇంత మేకోవర్‌లో చూడటం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.

ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి చేసుకునే దశలో ఉన్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 13న ‘వాల్మీకి’ విడుదల కానుంది. అదే రోజు నాని ‘గ్యాంగ్ లీడర్’ ఉన్నప్పటికీ ఎవరికి వారు తమ సినిమా పట్ల నమ్మకంగా ఉన్నారు. ‘డీజె’ లాంటి బ్రేక్ ఇచ్చిన హరీష్ శంకర్‌తో హీరోయిన్ పూజా చేస్తున్న రెండో సినిమా ఇదే. ఈ చిత్రంలో తమిళ హీరో అధర్వ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తమిళ్ బ్లాక్ బస్టర్ ‘జిగర్ తండా’ రీమేక్‌గా రూపొందుతున్న ‘వాల్మీకి’ తనకు సరికొత్త ఇమేజ్ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నారు హీరో వరుణ్‌తేజ్.

Valmiki movie teaser released on Aug 15