Home నిర్మల్ వర ప్రదాయిని స్వర్ణ జలాశయం

వర ప్రదాయిని స్వర్ణ జలాశయం

Varapradayini Svarna jalashayam

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

మన తెలంగాణ/సారంగాపూర్: నిర్మల్ జిల్లా వరప్రదాయిని స్వర్ణ జలాశయం అని రాష్ట్ర గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలో పలు అభివృద్ది పనులకు శంకుసస్థాపన చేశారు. స్వర్ణ ప్రాజెక్ట్  కోసం రూ.15 కోట్లతో అభివృద్ది పనులు  ప్రారంభించారు. స్వర్ణ జలాశాయాన్ని పరిశీలించారు. రూ.9లక్షలతో నిర్మించిన ఆడెల్లి ఆలయ స్వాగత తోరణం, రూ. కోటితో ఆడెల్లి ఆలయ చుట్టుప్రక్కల సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు.ముందుగా ఆడెల్లి ఆలయంలో అర్చకులు శ్రీనివాస్ శర్మ పూర్వకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక  పూజలు నిర్వహింపజేశారు. స్వర్ణ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రూ. 15 కోట్లతో మరమ్మత్తు పనులు వేగంగా జరుగుతాయని రా బోయే రోజుల్లో స్వర్ణ జలాశయంతో జిల్లా  సస్యశ్యామలం కానుందన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి అక్కడ నుండి పోచంపాడ్, స్వర్ణ ప్రాజెక్ట్‌లు నింపడం జరుగుతుందని దీంతో రైతులకు పుష్కలంగా నీరు అందుతుందని రైతులు అధిక దిగుబడి వచ్చే పంటలు పం డించాలన్నారు. ఆలయ  ఈ నిధులతో కట్టు వెడల్పు, బిటి రోడ్డు, నాలుగు కెనాల్‌లు, ఇందులో జౌళి నాలాను ప్రత్యేకంగా అభివృద్ది చేయాల్సి ఉందని, బతుకమ్మఘాట్, విశ్రాంతి భవనం నిర్మిస్తామన్నారు. ఇప్పుడు ఉన్న నీరు విడుదల చేస్తేనే పనులు జరుగాయని ఇప్పుడు ఉన్న నీటిని వదలడం జరుగుతుందన్నారు. అలాగే ఈ నీటితో మత్సకారులకు నష్టం వాటిల్లితుందని రాబోయే రోజుల్లో ఇంతకు రెండింతలు చేపపిల్లలను వదిలి మత్సకారులను ఆదుకుంటామని విద్యా ప్రమాణాలు రాష్ట్రంలోనే నం.1 జిల్లా తీర్చిదిద్దాలని సూచించారు. ఇందుకు ఆయా సంక్షేమ శాఖల యంత్రాంగం కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో 543 రెసిడెన్షీయల్ పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యా బోధన చేయడం జరుగుతుందన్నారు. కార్పోరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థల్లోని విద్యార్థులు చక్కని విద్యనభ్యసిస్తూ ఉత్తీర్ణత శాతం పెరిగాయని తెలిపారు. తాగు నీరు, రిఫ్రిజిరేటర్లు, సోలార్ విద్యుత్ వంటి మౌళఙక సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఇంకా ఎమైన అవసరాలు సలహాలు, సూచనలు అందించాలన్నారు. జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి అశన్న మాట్లాడుతూ వసతి గృహాలను రోల్‌మాడల్‌గా తీర్చి దిద్దడానికి 7.85 కోట్లతో ప్రతిపాదనలు సిద్దం చేసి ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిపారు. ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖల స్టడీ సర్కిళ్ళ డైరెక్టర్లు ప్రవీణ్ కుమార్, రమేష్‌లు మాట్లాడుతూ పోటీ పరీక్షల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే యువతకు శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ సమావేశంలో మావల సర్పంచ్ ఉష్కం రఘుపతి, బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖల అధికారులు, సిబ్బంది, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి రామన్న వంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా పులువురు మంత్రిని శాలువ, పూల మాలలతో సన్మానించారు.