Friday, March 29, 2024

అసలు పుతిన్‌కు ఏమైంది?

- Advertisement -
- Advertisement -

Various speculations on the health of Vladimir Putin

నయం చేయలేని వ్యాధితో బాధపడుతున్నాడని ఊహాగానాలు
బ్లడ్ క్యాన్సర్ అంటున్న రష్యా అధికారి

లండన్/మాస్కో : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం పై రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పుతిన్ తీవ్ర అనారోగ్యంగా గురయ్యాడని బ్రిటీష్ మాజీ గూఢచారి చెబుతున్నారు. అయితే ఆ అనారోగ్యం ఏమిటో తనకు స్పష్టంగా తెలియదని, నయం చేయలేనంత భయంకరమైన రోగమా? కాదా అనేది కూడా స్పష్టంగా తెలియదంటూ చెప్పుకొచ్చారు. పుతిన్ ఉక్రెయిన్ పై దాడికి దిగడం వల్లే ఇలాంటి అనారోగ్యానికి గురయ్యాడంటూ విమర్శించారు. 2016లో యూఎస్ ఎన్నికల ప్రచారంలో రష్యా జోక్యాన్ని ఖండించిన క్రిస్టోఫర్ స్టీల్ మనకు రకరకాలుగా అందుతున్న సమాచారాల ఆధారంగా పుతిన్ నిజంగానే అనారోగ్యంగా ఉండి ఉండొచ్చు అన్నారు.

మరోవైపు పుతిన్‌తో సన్నిహిత సంబంధాలున్న రష్యన్ అధికారి ఒకరు పుతిన్ బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని చెప్పడం విశేషం. అంతేగాదు అతను వెంచర్ క్యాపిటలిస్ట్‌తో జరిగిన చర్చల్లో పుతిన్ ఆరోగ్యం గురించి తెలుసుకున్నట్లు యూఎస్ మ్యాగజైన్ న్యూలైన్స్ పేర్కొంది. ఇటీవలే జరిగిన విక్టరీ డే వేడుకలలో కూడా పుతిన్ చాలా బలహీనంగా ఉన్నారు. అదీగాక పుతిన్ మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో సైనిక కవాతును వీక్షించడానికి రెండవ ప్రపంచ యుద్ధ అనుభవజ్ఞులు, సీనియర్ ప్రముఖుల మధ్య కూర్చున్నప్పుడు కూడా అతని కాళ్ళపై దట్టమైన ఆకుపచ్చ కవర్ ఉంది. పైగా ఇటీవల, పుతిన్ రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు మధ్య జరిగిన వీడియో సమావేశంలో టేబుల్‌ని గట్టిగా పట్టుకుని కూర్చొన్నాడు. ఇవన్నీ కూడా పుతిన్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడని చెప్పేందుకు బలం చేకూరుస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News