Friday, April 26, 2024

అక్టోబ‌ర్ 15న థియేటర్లో ‘వరుడు కావలెను’

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కరోనా నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్న థీయేటర్లకు ప్రేక్షకులను రప్పించేందుకు వరుసగా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా వచ్చే నెలలో దసరా కానుకగా విడుదలై ప్రేక్షకులను అలరించేందుకు తెలుగు సినిమాలు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే పలు సినిమాలు విడుదల తేదీలను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో సినిమా విడుదల తేదీని మూవీ మేకర్స్ ప్రకటించారు. యంగ్ హీరో నాగశౌర్య, రీతూ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘వరుడు కావలెను’. ఈ మూవీని అక్టోబ‌ర్ 15న విడుద‌ల చేస్తున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. కొత్త దర్శకురాలు లక్ష్మీ సౌజన్య రూపిందించిన ఈ సినిమా టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. డీవీ ప్రసాద్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

‘Varudu Kavalenu’ movie to release on Oct 15th

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News