మెగా ఫ్యామిలీ హీరోలు అందరూ ఒక దారిలో వెళ్తుంటే వరుణ్‌తేజ్ మాత్రం డిఫరెంట్ కథలను ఎంచుకుంటున్నాడు. ఫిదా, తొలిప్రేమ సక్సెస్‌లతో ప్రస్తుతం ఈ యంగ్ హీరో మంచి ఊపు మీదున్నాడు. తనకంటూ ఓ మార్కెట్‌ను సెట్ చేసుకున్న అతను తన రెమ్యునరేషన్‌ను కూడా పెంచేశాడు. అయితే ఈ మెగా హీరో నెక్స్ సినిమా తన కెరీర్లోనే బెస్ట్ సినిమాగా నిలవడం ఖాయమని తెలిసింది. స్పేస్ బ్యాక్‌గ్రౌండ్‌తో వరుణ్ ఈ సినిమా చేయబోతున్నాడు. ఘాజీ సినిమాతో మంచి సక్సెస్‌ను అందుకున్న సంకల్ప్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ కోసం గత కొంత కాలంగా సినిమా యూనిట్ వెతుకుతోంది. మొదట కొంత మంది మోడల్స్‌తో ఆడిషన్ చేశారు. కానీ ఎవరు హీరోయిన్ పాత్రకు సెట్ కాకపోవడంతో బాలీవుడ్ భామను తీసుకోవాలనుకున్నారు. చివరికి సుధీర్‌బాబుతో ‘సమ్మోహనం’ సినిమా చేస్తున్న అదితిరావు హైదరీని ఈ చిత్ర కథానాయికగా ఎంపికచేశారు. కథ నచ్చడంతో ఆమె ఈ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేసే పనిలో ఉందట. ఇక వచ్చేనెల చివరలో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు. అన్ని పనులను పూర్తిచేసి ఈ ఏడాది చివరలోనే సినిమాను విడుదల చేయాలని ఫిల్మ్‌మేకర్స్ నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలోని తన పాత్ర కోసం వరుణ్ బరువు తగ్గించుకునే పనిలో ఉన్నాడు.