Home సినిమా జీరో గ్రావిటీ సెట్స్‌లో ‘అంతరిక్షం 9000 కెఎంపిహెచ్’

జీరో గ్రావిటీ సెట్స్‌లో ‘అంతరిక్షం 9000 కెఎంపిహెచ్’

Varun Tej first look space film Antariksham released

వరుణ్‌తేజ్  హీరోగా నటిస్తున్న తొలి తెలుగు స్పేస్ థ్రిల్లర్ టైటిల్, ఫస్ట్‌లుక్‌ను స్వాతం త్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేశా రు. ఈ చిత్రానికి ‘అంతరిక్షం 9000 కెఎంపిహెచ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.  ఇందులో వరుణ్‌తేజ్  వ్యోమగామిగా నటిస్తున్నాడు. ఇప్పటివరకు తెలుగులో ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమా రాలేదు. హాలీవుడ్‌లోనే ఎక్కువగా వచ్చే స్పేస్ కాన్సెప్టులను ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి తీసుకొస్తున్నాడు దర్శకుడు సంకల్ప్‌రెడ్డి. ఆయన గత ఏడాది ‘ఘాజీ’ సినిమాతో జాతీయ అవార్డు అందుకున్నాడు. మరోసారి కొత్తగా ప్రయత్నిస్తూ ఈ సినిమాతో వస్తున్నాడు. ఈ చిత్రం కోసం అత్యున్నత సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఈ సినిమాను జీరో గ్రావిటీ సెట్స్‌లో చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు. దీనికోసం వరుణ్‌తేజ్ కజకిస్థాన్ వెళ్లి ప్రత్యేకంగా శిక్షణ తీసుకొని వచ్చాడు.  ఈ సినిమా కోసం హాలీవుడ్ టీం ఆధ్యర్యంలో అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేశారు. అదితిరావ్ హైదరీ, లావణ్య త్రిపాఠి ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు క్రిష్‌తో కలిసి ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. డిసెంబర్ 21న ఈ ‘అంతరిక్షం 9000 కెఎంపిహెచ్’ విడుదలకానుంది. సత్యదేవ్, శ్రీనివాస్ అవసరాల ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌ః జ్ఞానశేఖర్, సంగీతంః ప్రశాంత్ విహారి, ఎడిటర్‌ః కార్తీక్ శ్రీనివాస్, యాక్షన్ కొరియోగ్రాఫర్‌ః టాడర్ పెట్రోవ్ లాజారోవ్, సిజిః రాజీవ్ రాజశేఖరన్.