Home సినిమా ఫిబ్రవరి 9న వరుణ్ చిత్రం

ఫిబ్రవరి 9న వరుణ్ చిత్రం

varunశ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై వరుణ్‌తేజ్, రాశీఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో బివిఎస్‌ఎన్ ప్రసాద్ ఓ  చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఫిబ్రవరి 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ “వరుణ్‌తేజ్ హీరోగా మా బ్యానర్‌లో సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉంది. దర్శకుడు వెంకీ అట్లూరి లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల సినిమా లండన్ షెడ్యూల్ పూర్తయింది. 40 రోజుల పాటు ఏకధాటిగా జరిగిన ఈ షెడ్యూల్‌తో 70 శాతం టాకీపార్ట్ పూర్తయింది. డిసెంబర్ నెలనాటికి షూటింగ్‌ను పూర్తిచేస్తాం. తమన్ ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్, జార్జ్ సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తిచేసి ఫిబ్రవరి 9న సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశాం”అని అన్నారు.