Home దునియా ఎలా వెళ్లిందో ఏమో!

ఎలా వెళ్లిందో ఏమో!

Bicycle-Treeప్రపంచంలో ఎన్నో వింతలున్నాయి. దాంట్లో సైకిల్ ట్రీ కూడా ఒకటి. బ్రహ్మాండమైన చెట్టు కాండంలో ఓ సైకిల్ ఇరుక్కుపోయి ఎక్కడో సగం చెట్టులో కనిపిస్తూ ఉంటుంది. అమెరికాలోని వాషన్ ఐలాండ్‌లో కనిపించే ఈ సైకిల్ ట్రీ ఎదురుగా నిలబడి చూస్తుంటే అసలది ఎలా చెట్టు మధ్యలోకి చేరిందా? అని ఆశ్చర్యం వేస్తుంది. ఎప్పుడో ప్రపంచ యుద్ధ కాలంలో ఓ కుర్రవాడు తన సైకిల్‌ను గొలుసుతో చెట్టుకు కట్టేసి యుద్ధానికి వెళ్ళాడు. అతను తిరిగి రాలేదు. ఈ సైకిల్ కాస్తా చెట్టు మధ్యలో ఉండిపోయింది. అది ఎదుగుతూ ఉంటే అలా సైకిల్ పైకెళ్ళిపోయింది అంటారు అక్కడివాళ్ళు.

Vashon Island Bike Tree