Home ఆంధ్రప్రదేశ్ వార్తలు మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా వాసిరెడ్డి పద్మ…?

మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా వాసిరెడ్డి పద్మ…?

Vasireddy Padmaఅమరావతి : వైసిపి అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మను ఎపి మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా నియమించాలని సిఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎపిలో వైసిపి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ పదవిలో ఉన్న టిడిపి నేత నన్నపనేని రాజకుమారి రాజీనామా చేశారు. దీంతో ఈ పదవిలో వాసిరెడ్డి పద్మను నియమించాలని జగన్ నిర్ణయించుకున్నారని వైసిపి శ్రేణులు చెబుతున్నాయి. వైసిపి ఆవిర్భావం నుంచి వాసిరెడ్డి పద్మ పార్టీలో అధికార ప్రతినిధిగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే కేబినెట్ హోదా ఉన్న మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా పద్మ పేరును జగన్ ఖరారు చేశారని వైసిపి నేతలు కొందరు చెబుతున్నారు.

Vasireddy Padma As Women Commission Chairperson