Home జాతీయ వార్తలు జయపై సంధించిన బాణం

జయపై సంధించిన బాణం

vashanthi-devi1ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలలో తమిళనాడు ముఖ్య మంత్రి జయలలితపై డిఎండికె సారథ్యంలోని పీపుల్స్ వెల్‌ఫేర్ ఫ్రంట్ (పిడబ్లుఎఫ్) అభ్యర్థిగా ప్రము ఖ విద్యావేత్త, మాజీ వైస్ ఛాన్సలర్, మార్కిస్టు వి. వాసంతీదేవి పోటీ చేస్తున్నారు. విసికె, సిపిఐ (ఎం), టిఎంసి, ఎండిఎంకె సిపిఐ, మరికొన్ని పార్టీలతో కూడిన ఫ్రంట్ డా. రాధాకృష్ణ నగర్ నియోజక వర్గంలో జయల లితపై వాసంతిని ఉమ్మడి అభ్యర్థిగా గత బుధవారం ప్రకటించింది. . ఆమె మనోన్మనియమ్ యూనివర్శిటీకి 1992-98 మధ్య రెండు పర్యాయాలు విసిగా ఉన్నా రు. ఎఐఎడిఎంకె, డిఎంకె ప్రభుత్వాలు రెండింటి హయాంలో ఆమె పనిచేశారు. తమిళనాడు రాష్ట్ర మహి ళల కమిషన్‌కు సారథ్య బాధ్యత వహించారు. రాష్ట్ర ప్రణాళికా కమిషన్ సభ్యురాలిగా కొంతకాలం ఉన్నారు.
తమిళనాడులో ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం పీపుల్స్ వెల్‌ఫేర్ ప్రంట్ నిబద్ధమై ఉంది. వాసంతీదేవి కూడా అందుకు అనుగుణమైన అభ్యర్థే. ఉత్తర చెన్నైలోని ఈ ఆర్‌కె నగర్ ప్రాంతం చాలాకాలంగా నిర్లక్షానికి గురైంది. సెయింట్ జార్జి కోటకు అయిదు కిలోమీటర్ల దూరంలోని ఆ నియోజక వర్గంలో వాసంతీదేవి తన ప్రచారాన్ని అభ్యర్థిగా ప్రకటితమైన వెనువెంటనే ప్రారం భించారు. దళిత పార్టీ విదుతలాయ్ చిరుతైగల్ కచ్చి (విసికె) తరఫున ఆమె పోటీచేస్తున్నారు. అది తమిళ నాడులో ప్రధానమైన దళిత పార్టీ. ఆపార్టీకూడా పిడబ్లుఎఫ్ కూటమి లోనిదే.
విద్యా వైఫల్యాలపై ధ్వజం
77 ఏళ్ల వాసంతి తన తొలి ప్రచార సభలో పిల్లలను మనం ప్రైవేటు విద్యా సంస్థలకు పంపుతున్నది ప్రభు త్వాల వైఫల్యంవల్లనే అని స్పష్టంచేశారు. రిటైరయిన ప్పటినుంచి వాసంతీదేవి విద్యకుసంబంధించిన అంశాల పై దృష్టి పెట్టారు. విద్యార్థులు, టీచర్లను క్రమం తప్ప కుండా ఆమె కలుస్తూ ఉంటారు. విద్యను అతి ముఖ్య మైన రాజకీయ అంశంగా ఆమె చూస్తారు. ఎన్నికలలో పోటీ చేయాలని ఎన్నడు కోరుకోలేదు.ఆమె నియోజక వర్గంలో కార్మికులు అధికం. రోజు విడిచిరోజు వాసంతీ దేవి ఆర్‌కె నగర్‌లో ప్రచారం చేస్తున్నారు. నగరంలోని జాలరి వర్గం ప్రజలలో చాలామంది అక్కడే ఉంటారు. ఆ తరువాత దళితులు, ముస్లిములు అధికం. ఆ ప్రాంతం స్కూలు పిల్లలు చాలా మంది స్కూలు మధ్యలో చదువు మానివేసి మద్యానికి బానిసలవుతున్నారని ఓ ప్రచార సభలో వాసంతి తెలిపారు. పురుష కార్మికులలో కూడా త్రాగుడు సమస్య అధికంగా ఉంద న్నారు. ఆ పట్టణ నియోజక వర్గం ఓటర్ల సంఖ్య 2.5 లక్షలు. చెడిపోయిన రోడ్లు, లేనేలేని పేవ్‌మెంట్లు, ఇరుకు జీవితాలు పారిశుద్ధ నీటితో కలుషితమైన మంచినీటి పైపులు తదితర సమస్యలు అక్కడ సర్వ సాధారణం. ప్రభుత్వ స్కూళ్లు, ఆసుపత్రుల పట్ల ప్రభుత్వానిది చిన్న చూపు. కానీ అక్కడ రెస్టారెంట్ చైన్లు, రిటైల్ షాపులు మాత్రం బాగానే కొలువుతీరాయి. ఒక పూరిల్లు పదిమందికి ఆవాసం ఇవ్వడం అక్కడ మామూలు. వాసంతీదేవి అభ్యర్థిత్వం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ఆమె ఎంపిక ద్వారా పిడబ్లుఫ్ తాము కోరుకొంటున్న ప్రత్యా మ్నాయం ఎటువంటిదో చెప్పినట్ల యింది. తమిళనాడు కమ్యూనిస్టులు, దళిత పార్టీలతో కూడిన వైవిధ్యభరిత మైన ఫ్రంట్ అది. దానిలో వైగో సారథ్యంలోని మరుములార్చి ద్రవిడ మున్నేట్ర కజగం, కేంద్ర మాజీమంత్రి జికె వాసన్ సారథ్యంలోని తమిళ మానిల కాంగ్రెస్ ఉన్నాయి. ఫ్రంట్ సారథి దేశీయ మురుపోక్కు ద్రవిడ కజగమ్ నేత విజయకాంత్. ఆయన నే తమ తరపు సిఎం పదవి అభ్యర్థిగా ఫ్రంట్ ప్రకటించింది.
రెండు పార్టీల హవాను అడ్డుకోవడమే లక్షం
తమిళ రాజకీయాలు రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలు ద్రవిడ మున్నేట్ర కజగమ్ (డిఎంకె), ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగమ్ ( ఎఐఎడిఎంకె) చుట్టూ తిరగ డాన్ని అడ్డుకోవడమే తమ లక్షమని పి డబ్లు ఎఫ్ స్పష్టం చేసింది. ఫ్రంట్ తరఫున వాసంతీదేవిని ఆదిలో తోల్ తారుమవ లవణ్, విపికెకు చెందిన డి రవికుమార్ కలిసారు. వారు తనను ఎన్నికల్లో పోటీకి బ్రతిమాలడంలో సరైన కారణమే ఉందని ఆమె తలపోశారు. సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జి. రామకృష్ణన్ వంటి నేతలు కూడా అడగడంతో పోటీకి వాసంతీదేవి అంగీకరించారు. కుటుంబ సభ్యులతో కూడా లోతుగా చర్చించానని తెలిపారు. 1970 దశకంలో అయిదేళ్ల పాటు వాసంతి ఫిలిప్పీన్స్‌లో ఉన్నారు. రాజకీయ కూటములు, డైనమిక్స్‌లో అక్కడ పిహెచ్‌డి పట్టా పుచ్చుకొన్నారు. రాజకీయ ఖైదీలుగా గడిపినవారితో సహా చాలా మంది ప్రొఫెసర్లతో అమె కలిసి పనిచేశారు. అమెరికా కు కొత్త స్థావరంగా మారడం పట్ల ్ల ఫిలిప్పీన్స్ లో ఆ కాలంలో అజ్ఞాత నిరసన ఉద్యమం సాగుతుండేది. ఇక్కడ భారత దేశంలో అప్పట్లో విరుద్ధ వాతావరణం ఉందని, బహుళ జాతి కంపెనీలను నియంతించాలన్న స్పృహే లేదని ఆమె ఒక ఇంటర్వూలో చెప్పారు.
సిద్ధాంతాల కోసం ద్రవిడ ఉద్యమాలకు దూరం : తమి ళనాడులో ద్రవిడ ఉద్యమాలతో ఎటువంటి సంబంధం వాసంతీదేవికి లేదు. అందుకు ఆమె విచారం వ్యక్తం చేస్తున్నారు. తెగలవారీగా గుర్తింపు ఆలోచననే వామ పక్షీయులు, కాంగ్రెస్‌వారు గతంలో తెగనాడేవారని ఆమె వివరించారు. క్రిందిస్థాయి ఉద్యమాలనుంచి బ్రాహ్మణ భావజాలంవారు దూరంగా జరిగారు. కాని తనలాంటివారు సైద్ధాంతిక కారణాలపైనే వాటికి దూరంగా ఉన్నట్లు ఆమె తెలిపారు. అప్పట్లో ఆమె పూర్తిగా మార్కిస్టు సిద్ధాంతంతో మమేకమై ఉన్నారు. తమిళ నాట బ్రాహ్మణ వ్యతిరేకత బలంగా ఉండేదని, తాను పెరియార్ రామస్వామి ్రస్త్రీ ్తఅనుకూల భావాలపట్ల విపరీతంగా ఆకర్షితులైనానని కూడా వాసంతీదేవి చెప్పారు. ద్రవిడ ఉద్యమం తమిళ సమాజాన్ని ప్రజా స్వామికంగా మార్చినట్లు ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ద్రవిడ పార్టీలు ఆ సిద్ధాంతాలకు ఏమాత్రం ప్రాతినిథ్యం వహించడం లేదని స్పష్టంచేశారు. తమిళ జాతీయ వాదం, భారతీయ జాతీయవాదానికి భేదం చెబుతూ తమిళ జాతీయ వాదం సమాజాన్ని మరింతగా ప్రజా స్వామ్యీకరించడానికి , అణగారిన వర్గాల ఆర్థికస్వేచ్ఛకు దోహదకారి అని అభిప్రాయ పడ్డారు.

‘ఆ రెండూ అవినీతి పార్టీలే’
రాష్ట్ర మహిళా సంక్షేమ కమిషన్ అధ్యక్షురాలుగా, తరువాత మానవ హక్కులపై అవగాహన కల్పించే కార్యకర్తగా రెండు ద్రవిడ పార్టీలు ఒకటితరువాత ఒకటి అధికారాన్ని చెలాయిస్తూ ప్రజల జీవితాల్లో ఎటువంటి మార్పు తీసుకు రాలేకపోయాయో ఆమె స్పష్టంగా చూశారు. తమిళ జాతీయ రాజకీయాలు అధికారం, వనరులు- సంపద పంపకానికి దారితీయలేదని ఆమె వ్యాఖ్యానించారు. పైగా రెండు ప్రాంతీయ పార్టీలు చాలా ఏళ్లుగా అవినీతిని పెంచి పోషించాయని కూడా ఆమె ఆరోపించారు. మొత్తం ప్రజాస్వామ్మ స్ఫూర్తే చెడిపోవడం అసలు సమస్య అని ఆమె అంటున్నారు.