Home తాజా వార్తలు బిపిసిఎల్‌ను కొనేందుకు వేదాంత రూ.90 వేల కోట్ల బిడ్!

బిపిసిఎల్‌ను కొనేందుకు వేదాంత రూ.90 వేల కోట్ల బిడ్!

Vedanta puts $12-bn price tag on bharat petroleum

 

న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ పెట్రోలియం సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్)ను కొనుగోలు చేసేందుకు వేదాంత గ్రూప్ రూ.90 వేల కోట్ల బిడ్‌ను దాఖలు చేయాలనుకుంటోంది. బ్లూమ్‌బెర్గ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ ఈ విషయాన్ని తెలిపారు. సరైన ధరకే కంపెనీని కొనుగోలు చేయాలనుకుంటున్నామని, కంపెనీ స్టాక్ 2021 సెప్టెంబర్‌లో రూ.503 వద్ద ఉంది, ఇది ఇప్పుడు రూ.397 చేరిందని అన్నారు. దీని మార్కెట్ క్యాప్ రూ.85,522 కోట్లు ఉందని, దీని ఆధారంగానే వేదాంత రూ.90 వేల కోట్ల వేలం వేయాలని భావిస్తోందని అన్నారు. భారత్ పెట్రోలియంను విక్రయించాలని ప్రభుత్వం చాలా కాలంగా ప్రయత్నిస్తోంది, కానీ ఇది ఓ కొలిక్కి రావడం లేదు. ప్రభుత్వ అతిపెద్ద పెట్టుబడుల ఉపసంహరణలో ఇది ఒకటి. బిపిసిఎల్‌లో ప్రభుత్వానికి 52.98 శాతం వాటా ఉంది. కంపెనీలో ప్రజల వాటా 46.71 శాతంగా ఉంది. బిపిసిఎల్‌లో విక్రయం తర్వాత ప్రభుత్వం మొత్తం నిర్వహణను కొనుగోలు చేసే కంపెనీకి బదిలీ చేస్తుంది.బిపిసిఎల్ దేశవ్యాప్తంగా మొత్తం 15,177 పెట్రోల్ పంపులు, 6,011 ఎల్‌పిజి డిస్ట్రిబ్యూటర్ ఏజెన్సీలను కలిగి ఉంది.