Saturday, April 20, 2024

వాహన ఆల్టరేషన్ నిబంధనలకు వ్యతిరేకం

- Advertisement -
- Advertisement -

మార్పులు చేర్పులు చేసే ఇబ్బందులు తప్పవు : రవాణాశాఖ అధికారులు

మన తెలంగాణ/సిటీబ్యూరో : ప్రభుత్వానికి వాహన పన్ను, ఇతర ఫీ జులు చెల్లిస్తున్నాం కదాని ఇష్టం వచ్చినట్లుగా వాహనాల్లో మార్పులు చేయడం కుదరదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అనుమతులు లే కుండా వాహనాల్లో మార్పులు ,చేర్పులు చేయడం మోటారు వాహన చట్టం సెక్షనం 46(1) పూర్తి విరుద్ధమని అధికారులు చెబుతున్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే అనుమతులు జారీ చేస్తామని చెబుతున్నారు. సెలబ్రిటీలు ఉపయోగించే కార్ వ్యాన్‌లకు అనుమతులు ఇచ్చే ముందు తగినంత ఫీజులు చెల్లించిన అనంతరమే మార్పులు చే సుకునే అవకాశం ఇస్తామని చెబుతున్నారు.

ఎన్నికలు ముందు కొం తమంది వ్యక్తులు తమ వాహనాలకు ఇష్టం వచ్చినట్లు మార్పులు చే ర్పులు చేస్తుంటారని వారు రవాణాశాఖ నుంచి ఎటువంటి అనుమతు లు తీసుకోడం లేదని అంశం తమ దృష్టికి వచ్చినట్లు చెబుతున్నారు. వి ఐపీలు ఉపయోగించే వాహనాలు వ్యాన్లు అంతర్‌భాగంలో ఎటువంటి మార్పులైన చేసుకోవచ్చు కాని, దాన్ని పూర్తిగా ఓపెన్‌టాప్ చేసేందుకు నిబంధలను అనుమతించవని చెబుతున్నారు. అదే విధంగా ఒక ట్రాలీని వ్యాన్ మార్చేందుకు వీల్లేదని చెబుతున్నారు.

మార్పులు చేయడంతో సమస్యలే : రవాణశాఖ అధికారులు… ఒక వాహనం తయారు చేసేముందు ఆయా వాహనానికి తయారీదారులు కొన్ని ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉం చుకుని చేస్తారని అధికారులు చెబుతున్నారు. వాటిని అతిక్రమించి మార్పులు చేయడం ద్వా రా సమస్యలు కొనితెచ్చుకోవడమే అని చెబుతున్నారు. వాహన బరువుకు మించి మార్పులు చేయడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. వాహదారుల ఆర్సీలో కూడా వాహన రంగు, బరువు, సీ టింగ్ సామర్ధం వివరాలు ఉంటాయని వాటి ని మార్చడం ( ఆల్టరేషన్ చేయడం ద్వారా )అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు సదరు వాహనదారులకు ఎటువంటి ప్రయోజనాలు (వాహన బీమా, ప్రమాదబీమా) లభించక పోవడమే కాకుండా సదరు వాహదారులు చట్టపరమైన సమస్యల్లో పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News