Saturday, April 20, 2024

గిఫ్ట్ ఎ స్మైల్… వికలాంగులకు 101 వాహనాలు: ఎంపి రంజిత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మంత్రి కెటిఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఎ స్మైల్ లో భాగంగా తన వంతుగా వికలాంగులకు 101 మూడు చక్రాల వాహనాలు

మంత్రి కెటిఆర్ పిలుపుకు స్పందించిన ఎంపి రంజిత్ రెడ్డి

ఎంపి రంజిత్ రెడ్డిని ప్రశంసించిన మంత్రి కెటిఆర్

Vehicles distributed in Gift a smile

హైదరాబాద్: మంత్రి కెటిఆర్ తన జన్మదినం సంద‌ర్భంగా గిఫ్ట్ ఎ స్మైల్ కార్య‌క్రమంలో భాగంగా వికలాంగులకు మూడు చక్రాల వాహనాలను పంపిణీ చేయాలని తన ట్విట్టర్ ద్వారా పిలుపును ఇవ్వగా చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ జి. రంజిత్ రెడ్డి తన వంతుగా తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వచ్చిన మొత్తం వికలాంగుల దరఖాస్తులకు తన సొంత నిధులతో వాహనాలను సమకూరుస్తానని ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. దీనిని చూసిన మంత్రి కెటిఆర్ ఎంపి రంజిత్ రెడ్డిని అభినందించి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపి రంజిత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. యువ నాయకుడు, మంత్రి కెటిఆర్ జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం ప్రజలకు ఏదో ఒక్క సహాయ కార్యక్రమం చేపడుతామని, ఈ సారి వికలాంగులకు మూడు చక్రాల వాహనాలను తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో వచ్చిన మొత్తం 101 వికలాంగుల దరఖాస్తుదారులకు త్వరలో పంపిణీ చేస్తామన్నారు. ప్రజలు, నాయకులు మంత్రి కెటిఆర్ పిలుపు మేరకు ఎంపి రంజిత్ రెడ్డి చూపిన ఉదారతపై ప్రశంసిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News