Friday, March 29, 2024

బహుజన రాజ్యాధికార పోరాటయోధుడు సర్దార్ పాపన్న

- Advertisement -
- Advertisement -

Vemula prashanth reddy tribute on sardar papanna

హైదరాబాద్: మొగలాయి దౌర్జన్యాలను ఎదురించి, తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని రాష్ట్ర రోడ్లు భవనాలు,గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని మంత్రి అధికారిక నివాసంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372 వ జయంతి సందర్భంగా ఆయన సేవలు స్మరించుకుని ఆయన చిత్రపటానికి మంత్రి పుష్పాంజలి ఘటించారు. తెలంగాణ ప్రజల మీద ఎన్నో అరాచకాలు చేస్తున్న మొగల్‌ పరిపాలన తాలూకు భూస్వాముల గుండెల్లో గునపమైండని, ఒక వ్యక్తిగా మొదలై ప్రజలను చైతన్యం చేసుకుంటూ ఒక సామ్రాజ్యాన్ని స్థాపించిన బహుజన బందూక్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ అని కొనియాడారు. ఈ గడ్డమీద పోరాటం మొదలుపెట్టి రాజ్యాన్ని ఏలిన తొలి బహుజన రాజుగా చరిత్రలో నిలిచిపోయారన్నారు. వరంగల్‌-గోల్కొండ మధ్యలో 21 కోటలను స్థాపించి నెలకొల్పిన బురుజుల అన్నిటికి మూలం గోల్కొండ కోట అని ఆయన చరిత్ర ఘన కీర్తిని మంత్రి ప్రస్తావించారు.

కేసిఆర్ ప్రభుత్వం గౌడ కులవృత్తిని అన్ని విధాలా ప్రోత్సహిస్తోందని తెలిపారు. 2లక్షలు ఉన్న ఇన్సూరెన్స్ 5 లక్షలు చేశామని, తాటి, ఈత చెట్లపై గీత పన్ను పూర్తిగా రద్దు చేసినట్లు తెలిపారు. ప్రత్యేకంగా గీత కార్మికుల సంక్షేమం కోసం నీరా పాలసీ తెచ్చామని, ఆర్ధిక బరోసా కోసం ఆసరా పెన్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వమే తాటి,ఈత వనాలు పెంచుతూ గౌడ కులవృత్తి వారికి అండగా నిలుస్తుందని అన్నారు. పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని ప్రభుత్వమే ఏటా అధికారికంగా నిర్వహిస్తోందని అన్నారు. ఆయన స్పూర్తితోనే కేసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సబ్బండ వర్గాల సంక్షేమం కోసం పని చేస్తోందని పునరుద్ఘాటించారు. మంత్రి తో పాటు నివాళులు అర్పించిన వారిలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు,మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల చారి పలువురు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News